
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 3


సెన్సార్ పూర్తిచేసుకున్న నా సామిరంగ

గుంటూరు కారంకు సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నా సామిరంగ

లాల్ సలామ్.. కపిల్ దేవ్ కు టీమ్ బర్త్ డే విషెస్

ఇంటెన్స్ ఫీల్ తో అదిరిపోయిన తండేల్ ఫస్ట్ గ్లింప్స్

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

అయలాన్ ట్రైలర్ రిలీజ్

బేబీ చేతిలో మూడు సినిమాలు

కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ

విజయకాంత్ సమాధి వద్ద సూర్య కన్నీరు

రామ్ చరణ్ RC16లో కన్నడ సూపర్ స్టార్

యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న భీమా టీజర్

అందుకే వెనక్కి వెళ్ళాం -రవితేజ

మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?

సంక్రాంతి సినిమాల రన్ టైం రివీల్

శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది - మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

గుంటూరు కారం నుండి ఎనర్జిటిక్ మావా ఎంతైనా సాంగ్ రిలీజ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా గుంటూరు కారం సందడే కనిపిస్తుంది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. అతడు, ఖలేజా వంటి క్రేజీ సినిమాల తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా సంక్రాంతికి సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలని.. ఆదిశగానే చిత్రయూనిట్ సినిమాను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

ఇకనుంచి నా అభిమానులే నాకు అమ్మ, నాన్న.. అన్నీ - మహేష్ బాబు
'గుంటూరు కారం' కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న నా సామిరంగ
ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారంకు సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు ,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం.ట్రైలర్ కూడా విడుదలకాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.యూఎస్ఏ లో బుకింగ్స్ ఓపెన్ కాగా ఇప్పటివరకు 450k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.సినిమా రిలీజ్ టైం కి వన్ మిలియన్ దాటనుంది.మహేష్ కు ఓవర్సీస్ లో సాలిడ్ మార్కెట్ వుంది. ఒకటి రెండు కాదు ఏకంగా 11సినిమాలు మిలియన్ మార్క్ ను క్రాస్ చేశాయి ఇక ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం కూడా దుమ్మురేపుతోంది.

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నా సామిరంగ
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్న మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

లాల్ సలామ్.. కపిల్ దేవ్ కు టీమ్ బర్త్ డే విషెస్
ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాలో కపిల్ దేవ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే నేడ కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ బర్త్ డే విషెస్ ను అందించారు. కపిల్ దేవ్ తో పాటు రజినీ కాంత్ ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఇంటెన్స్ ఫీల్ తో అదిరిపోయిన తండేల్ ఫస్ట్ గ్లింప్స్
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు దూత అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. దూత వెబ్ సిరీస్ తో మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తండేల్. చందూ మొండేటి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేమమ్ అలానే సవ్యసాచి సినిమాలు రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాబోతున్నారు. ఈసినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్‌లో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి.

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
సర్కారు వారి పాట సినిమాతో హిట్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం అంటూ వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. గత సినిమాల్లో కంటే భిన్నంగా ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు మహేష్. ఈసినిమా పొంగల్ బరిలో దిగనుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్, పాటలను రిలీజ్ చేస్తుండగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయలాన్ ట్రైలర్ రిలీజ్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు.

బేబీ చేతిలో మూడు సినిమాలు
బేబీతో సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య.అంతకు ముందు వెబ్ సిరీస్ ల్లో అలాగే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు వేసింది.ఇక గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.ఏకంగా 70కోట్లకు పైగా వసూళ్లను సాధించి భారీ లాభాలను తీసుకొచ్చింది.ఈసినిమాలో వైష్ణవి నటనకు కూడా ప్రశంసలు దక్కాయి.

కన్నప్ప తో మంచు విష్ణు తనయుడు ఎంట్రీ
మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను న్యూజిలాండ్ లో మొదలుపెట్టిన చిత్రయూనిట్ అక్కడ 90 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకొని రీసెంట్ గానే వచ్చారు.

విజయకాంత్ సమాధి వద్ద సూర్య కన్నీరు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు పెట్టుకున్న ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ప్రముఖ తమిళ నటుడు మరియు రాజకీయ నేత అయిన కెప్టెన్ విజయకాంత్ కన్నుమూసిన విషయం తెలిసిందే. కెప్టెన్ అనూహ్య మరణం తమిళ చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇక తమ ప్రియతమ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. అయితే ఆ సమయంలో విదేశాల్లో షూటింగ్ కారణంగా నటుడు సూర్య కెప్టెన్ అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు.

రామ్ చరణ్ RC16లో కన్నడ సూపర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తరువాత, ఆయన 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి పనిచేయనున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి. #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ (శివన్న) కూడా చేరడం గమనార్హం.

గుంటూరు కారం సెన్సార్ రివ్యూ
కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈసినిమాను సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న భీమా టీజర్
ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో గోపీచంద్ కూడా ఉన్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు గోపీచంద్. చేయడానికి వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు రావడం లేదు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు గోపీచంద్. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, ఫోటోలు వైరల్
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం తర్వాత జాన్వీ కపూర్, మహేశ్వరిలు రంగనాయకుల మండపంలో పండితుల నుంచి వేదఆశీర్వచనం అందుకున్నారు. అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అందుకే వెనక్కి వెళ్ళాం -రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈగల్ సంక్రాంతి వార్ నుండి తప్పుకుంది.నిన్న రిలీజ్ విషయంలో చాలా సేపు సస్పెన్స్ కొనసాగకా ఈరోజు ఉదయం సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.సంక్రాంతికి రావాలని చివరి నిమిషం వరకు పోరాడారు కానీ రాత్రి నిర్మాత ల మండలి మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలకు అంగికరించి వేరే సినిమాల గురించి ఆలోచించి ఈనిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్?
2023 ఇయర్ ముగిసిపోయింది. ఎన్నో సినిమాలు గత ఏడాది బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు ఇలా ఎన్నో సినిమాలు అలరించాయి. వాటిలో కొన్ని సినిమాలు సంచనాలు సృష్టిస్తే.. కొన్ని పరాజయం పాలయ్యాయి. ఇక గత ఏడాది కొన్ని క్రేజీ కొత్త జంటలు సైతం స్క్రీన్ పై మెరిశాయి. చిరంజీవి-శృతిహాసన్, బాలకృష్ణ-కాజల్, నవీన్ పోలిశెట్టి-అనుష్క తోపాటు చాలా పెయిర్స్ సందడి చేశాయి. మరి కింద తెలిపిన జంటల్లో మీకు నచ్చిన బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ ఎవరో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

సంక్రాంతి సినిమాల రన్ టైం రివీల్
ఈ సంక్రాంతికి ఎప్పుడు లేనంతగా తీవ్రమైన పోటీ నెలకొంది.ఒకటి కాదు రెండు ఏకంగా 5సినిమాలు వస్తున్నాయి.ఇందులో ఒకటి డబ్బింగ్ సినిమా అదే అయలాన్.శివ కార్తికేయన్ నటించిన ఈసినిమా ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తుంది.ఈరోజు రాత్రి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక మిగితావి స్ట్రయిట్ తెలుగు సినిమాలు.అందులో ముగ్గురి స్టార్ హీరోల సినిమాలు ఉండగా మరొకటి మీడియం బడ్జెట్ మూవీ. అవేంటంటే గుంటూరు కారం,హనుమాన్,సైంధవ్,నా సామి రంగ.