ప్రముుఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా వస్తుంది నా సామిరంగ. ఈసినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియోలు పాటలు,టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే సంక్రాంతికి నా సామిరంగ అనేలానే ఉంది. సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి. నాగ్ ఫ్యాన్స్ కు ట్రైలర్ తో ఫుల్ ట్రీట్ ఇచ్చారు. కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం ముగించుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం.
This Sankranthi, 𝗨nlimited entert𝗔inment Guaranteed!❤️🔥#NaaSaamiRanga censored with U/A! Enjoy this festival like never before with #NaaSaamiRangaOnJAN14 💥💥#NSRForSankranthi
KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath… pic.twitter.com/xR0U8z0AvI
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 9, 2024
కాగా ఈసినిమాలో అషికా రంగనాథ్ మిర్నా, రుక్సార్ థిల్లన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉండగా ఈసినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: