శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే.. హీరోలందరికీ తాట ఊడిపోద్ది – మహేష్ బాబు

Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Praises Sreeleela Dance Skills

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. “శ్రీలీల గురించి చెప్పాలంటే.. చాలారోజుల తర్వాత ఒక తెలుగమ్మాయి పెద్ద హీరోయిన్ కావడం చాలా ఆనందంగా ఉంది. హార్డ్ వర్క్ చేసే డెడికేటెడ్ ఆర్టిస్టులలో ఆమె ఒకరు. ఆమె షాట్ చిత్రీకరణ లేకపోయినా అక్కడే ఉంటుంది. మేకప్ వ్యాప్ లోకి వెళ్ళదు. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేయడం.. వామ్మో(నవ్వుతూ).. అదేం డ్యాన్స్. హీరోలు అందరికీ తాట ఊడిపోయిద్ది. శ్రీలీలకి అద్భుతమైన భవిష్యత్ ఉంది” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మీనాక్షి మా సినిమాలో ప్రత్యేక పాత్ర చేసింది. నేను, త్రివిక్రమ్ గారు అడగగానే అసలేం ఆలోచించకుండా వెంటనే సినిమా చేయడానికి అంగీకరించింది. ఆ విషయంలో ఎలా థాంక్స్ చెప్పాలో అర్థంకావట్లేదు. ఆ పాత్రకు నిండుతనం తీసుకొచ్చింది. అలాగే థమన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు సోదరుడిలాగా. అతను ఎప్పుడూ తన బెస్ట్ ఇస్తాడు. ఈ సినిమాలో ఆ కుర్చీ మడతపెట్టి చేస్తావా అని నేను, త్రివిక్రమ్ గారు అడిగితే అసలు ఆలోచించకుండా వెంటనే చేశాడు. వేరే ఏ సంగీత దర్శకుడైనా పది డిస్కషన్ లు పెట్టేవాడు. థమన్ అలా చేయలేదు. రేపు ఆ పాట మీరు చూడండి.. థియేటర్లు బద్దలైపోతాయి. థాంక్యూ థమన్” అని చెప్పారు మహేష్ బాబు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 3 =