టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్న మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదల తేదీ దగ్గర పడుతున్నందున చిత్రబృందం సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్రబృందం షూటింగ్ చివరిరోజున గుమ్మడికాయ కొడుతున్న వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన అన్ని ప్రచారచిత్రాలు నాగ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ ని అలరించాయి.
కాగా ఈ సినిమాకు ‘నేను లోకల్’, ‘ధమాకా’ సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ కథనందించగా.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో ‘నా సామిరంగ’తో పాటు మరికొన్ని అగ్రహీరోల భారీ బడ్జెట్ చిత్రాలు ఉండడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ సినిమా ఏమేరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























