ఇకనుంచి నా అభిమానులే నాకు అమ్మ, నాన్న.. అన్నీ – మహేష్ బాబు

Guntur Kaaram Pre-Release Event Mahesh Babu Says Thanks To His Fans

‘గుంటూరు కారం’ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తర్వాత వారి కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘గుంటూరు కారం’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం గుంటూరులోని నంబూరు క్రాస్ రోడ్స్ లో అభిమానుల కోలాహలం నడుమ ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించారు. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కథానాయకుడు మహేష్ బాబు మాట్లాడుతూ.. “పాతిక సంవత్సరాలు మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ప్రతి ఏడాది అది పెరుగుతూనే ఉంది. చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప ఏం చేయాలో తెలీదు. మీరు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. నాకు, నాన్నగారికి సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండగ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగ కొడతాం” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇంకా మహేష్ మాట్లాడుతూ.. “కానీ ఈసారి ఎందుకో కొంచెం కొత్తగా ఉంది. ఎందుకంటే నాన్నగారు మన మధ్యన లేరు.. అందువల్లేమో. ఆయన నా సినిమా చూసి రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి చెప్తుంటే ఆనందం వేసేది. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తూ ఉండేవాడిని. దానికోసమేగా ఈ సినిమాలు, ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి నాకు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్నీ. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. ఈ ఫంక్షన్ జరగడానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీస్ వారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =