
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 140


ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్

ఒకటో నెంబర్ కుర్రాడు తారక రత్న ఇక లేరు

ధమ్కీ కొత్త రిలీజ్ ప్లాన్

NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా

త్వరలో ఏజెంట్ మ్యూజికల్ బ్లాస్ట్

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్

సమంత ఫ్లోర్ వర్కవుట్

దూకుడు మూవీ స్పెషల్ షో రికార్డ్
అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ లుక్

త్వరలో విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తాజా షెడ్యూల్

పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్ రిలీజ్

ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్

త్వరలోనే హిట్ కొడదాం అంటున్న విజయ్ దేవరకొండ

జపాన్ లో తెలుగు సినిమా సత్తా చాటిన ఆర్ ఆర్ ఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్…

రిలీజ్ అయిన రావణాసుర సెకండ్ సింగల్ ప్యార్ లోన పాగల్
ధమాకా, వాల్తేరు వీరయ్య మూవీస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అభిషేక్ పిక్చర్స్, ఆర్.టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రావణాసుర మూవీ 2023 ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్ష నగార్కర్ కథానాయికలు. హీరో సుశాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా…

ప్రాజెక్ట్ K మూవీ రిలీజ్ డేట్
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ K మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే, దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ Kమూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయిలో సీనియర్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

ఒకటో నెంబర్ కుర్రాడు తారక రత్న ఇక లేరు
2001 సంవత్సరంలో తారక రత్న నటనపై ఆసక్తితో సినీ రంగ ప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభమయ్యాయి. ఒకే రోజు అత్యధిక సినిమాలు ఓపెనింగ్ చేసుకొన్న హీరోగా తారకరత్న గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతోతారక రత్న హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో తారకరత్న 30కిపైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తారక రత్న ప్రేక్షకులను అలరించారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అమరావతి…

ధమ్కీ కొత్త రిలీజ్ ప్లాన్
కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుండగా.. ఈసినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది. నందమూరి తారక రత్న మరణం వల్ల ఎన్టీఆర్ 30 వ సినిమా ఓపెనింగ్ డేట్ ను వాయిదా వేశారు. కొత్త డేట్ ను త్వరలో తెలియచేయనున్నారు. కాగా…

త్వరలో ఏజెంట్ మ్యూజికల్ బ్లాస్ట్
రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు అఖిల్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటినుండే మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన రిలీజ్ డేట్ వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ కూడా క్యూరీయాసిటీని పెంచింది.

పుష్ప 2 క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

మైత్రీ మూవీస్ చేతిలో కోనసీమ థగ్స్- భారీ స్థాయిలో రిలీజ్
శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంది. ఇక మరోవైపు ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

నేను స్టూడెంట్ సార్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు బెల్లంకొండ గణేష్. అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. రాకీ ఉప్పలపాటీ దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ హీరోగా వస్తున్న సినిమా నేను స్టూడెంట్ సార్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీంతో మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను మార్చి 10 వ తేదీకి ఫిక్స్ చేశారు. ఈమేరకు ఒక పోస్టర్…

సమంత ఫ్లోర్ వర్కవుట్
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీలో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్నారు.

సోషల్ మీడియా లో వైరల్ గా క్రికెటర్ సచిన్ , హీరో సూర్యల ఫొటో
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో సూర్య తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో సూర్య ఫస్ట్ టైమ్ పీరియాడికల్ మూవీ #సూర్య 42 తో ప్రేక్షకులను అలరించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్స్ పై శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా సూర్య 42 తమిళ మూవీ భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటానీ కథానాయిక.

దూకుడు మూవీ స్పెషల్ షో రికార్డ్
14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత జంటగా, భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ దూకుడు మూవీ ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. దూకుడు మూవీ 63 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. థమన్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. తొలిసారిగా విజయ్ నేరుగా తెలుగులో నటించిన ఈ మూవీని వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా తమిళంలో జనవరి 11వ తేదీన అలానే తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించింది.

వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ అక్కినేని స్పీచ్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ లుక్
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పుష్ప మూవీ సెకండ్ పార్ట్ పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం…

త్వరలో విజయ్ దేవరకొండ ఖుషి మూవీ తాజా షెడ్యూల్
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి చికిత్స కారణంగా కొద్ది రోజుల పాటు షూటింగ్ లకు కాస్త బ్రేక్ తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే షూటింగ్ లో మళ్లీ బిజీగా పాల్గొంటు న్నారు.

పులి మేక వెబ్ సిరీస్ గ్లింప్స్ రిలీజ్
ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయి కుమార్ ఇప్పుడు వెబ్ సిరీస్ లతో కూడా అలరించడానికి వస్తున్నాడు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో వస్తున్న వెబ్ సిరీస్ పులి-మేక. ఇక ఈసిరీస్ జీ5 లో 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగా తాజాగా ఈసిరీస్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సిరీస్ ను రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉండి సిరీస్ పై అంచనాలను పెంచేస్తుంది.

ప్రభాస్ ప్రాజెక్ట్ K మూవీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగాతెలుగు, హిందీ భాషలలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 జూన్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్ మూవీ 2023 సెప్టెంబర్ 28వ తేదీ రిలీజ్ కానుంది.ప్రభాస్ హీరోగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

త్వరలోనే హిట్ కొడదాం అంటున్న విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అటు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లోనూ.. నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తరువాత తను కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుస హిట్లతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.