త్వరలోనే హిట్ కొడదాం అంటున్న విజయ్ దేవరకొండ

Will Have A Hit Soon Says Talented Actor Vijay Devarakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actor Vijay Devarakonda,Hero Vijay Devarakonda,Vijay Devarakonda,Vijay Devarakonda Movies,Vijay Devarakonda New Movie,Vijay Devarakonda Latest Movie,Vijay Devarakonda Upcoming Movie,Vijay Devarakonda New Movie Updates,Vijay Devarakonda Latest Movie Updates,Vijay Devarakonda Movie Updates,Vijay Devarakonda Movie News,Vijay Devarakonda New Projects,Vijay Devarakonda Latest Projects,Vijay Devarakonda Upcoming Projects,Vijay Devarakonda Next Projects,Vijay Devarakonda Latest News,Vijay Devarakonda Movie Updates,Vijay Devarakonda About Hit Movies,Vijay Devarakonda Talks About Hit Movies,Vijay Devarakonda Interview,Vijay Devarakonda Latest Interview,Vijay Devarakonda New Interview

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అటు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లోనూ.. నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తరువాత తను కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుస హిట్లతో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా విజయ్ కు కూడా హిట్ వచ్చి చాలా కాలమైంది. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా వరుస ఫ్లాప్స్ ను మూటగట్టుకున్నాడు. దీంతో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ నుండి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలోనే త్వరలో హిట్ కొడదాం అంటున్నాడు విజయ్. తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా ముచ్చటించారు. ట్విట్టర్ ద్వారా ఈసందర్భంగా అభిమానులతో ముచ్చటించిన విజయ్ ను ఓ అభిమాని మర్చిపోలేని ఒక్క హిట్ ఇవ్వన్నా అని అడిగాడు. దానికి స్పందించిన విజయ్ ‘హిట్ ఒక్కటే పెండింగ్ రా.. త్వరలో కొట్టేద్దాం’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శివ నిర్వాణ దర్శకత్వంలో క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా వస్తున్న ఈసినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. త్వరలోనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు. దీనితో పాటు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమా కూడా చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 6 =