వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆర్గానిక్ ఫామింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంటుంది. నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను రేపు ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే చిత్ర నిర్మాణసంస్థ ఒక అప్ డేట్ ఇచ్చింది. ఈ పూజా కార్యక్రమానికి అతిథిగా మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
The Grand Launch of #VNRTrio movie will be graced by the one and only Megastar @KChiruTweets Garu ❤️🔥
Pooja Ceremony Tomorrow 💥💥@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/ilBRF8VJ5i
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: