
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 108


బలగం మన కుటుంబ విజయం

ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి

కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా చైతన్య

హిలేరియస్ గా ఉగ్రం ప్రమోషన్స్ వీడియోలు

భువన విజయమ్ ట్రైలర్ రిలీజ్

యాక్షన్ సీక్వెన్స్ తో జపాన్ న్యూ షెడ్యూల్
ఓజి షూటింగ్ అప్డేట్

ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్

కస్టడీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సీతారామం కు దాదా సాహెబ్ అవార్డ్

విశ్వక్ సేన్ గామి షూటింగ్ కంప్లీట్

NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్‌డేట్

రెయిన్ బో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

200 కోట్ల ఎపిక్ కలెక్షన్స్ తో పొన్నియన్ సెల్వన్ 2
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమాను 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కించాడు. అయితే రెండు పార్ట్ లుగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ సైతం రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టిస్తుంది.

బలగం మన కుటుంబ విజయం
పలు సినిమాల్లో కమెడియన్ గా అలానే బుల్లి తెరపై పలు కామెడీ షోల్లో అలరించిన వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూశాం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాల నేపథ్యంతో ఈసినిమా రావంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు ఈసినిమా చూసి కలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత ప్రజాదారణ పొందింది ఈసినిమా.

ఎన్టీఆర్30 సెకండ్ షడ్యూల్ పూర్తి
ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు ఈసినిమా కథపై రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంది. ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని.. కొరటాల శివ, ఎన్టీఆర్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ను ఇవ్వనున్నారని.. ఇంకా ఎన్టీఆర్ రెజ్లర్ గా కనిపించనున్నాడని ఆ ఎపిసోడ్ సినిమాకై హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. దీంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

కస్టడీ ప్రమోషన్స్ లో బిజీగా చైతన్య
ఈ సమ్మర్ లో ఫుల్ పాజిటివ్ వైబ్ తో విడుదలవుతున్నసినిమా కస్టడీ.స్టిల్స్,టీజర్ తో సినిమా కు సూపర్ హైప్ రాగ ఈశుక్రవారం ట్రైలర్ కూడా విడుదలకానుంది.ఇక ట్రైలర్ కూడా అదిరిపోయిందని టాక్.యువ సామ్రాట్ నాగ చైతన్య నటించిన ఈసినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేశారు.విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమాను భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తున్నారు.ముఖ్యంగా నాగ చైతన్య వరస ప్రమోషన్స్ తో ఫుల్ బిజీ గా వున్నాడు.మీడియాకు ఇంటర్వ్యూ లు ఇవ్వడం అలాగే సోషల్ మీడియా లో క్రేజ్ తెచ్చుకున్న వారితో కలిసి సినిమా ను ప్రమోట్ చేస్తున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతన్నాయి.

హిలేరియస్ గా ఉగ్రం ప్రమోషన్స్ వీడియోలు
అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అనిపించుకుంది దాంతో ఉగ్రంకు హైప్ వచ్చింది.దానికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు. అందులో భాగంగా నిన్న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.అయితే ఈ సారి ప్రమోషన్స్ విషయంలో ఉగ్రం టీం డిఫ్రెంట్ గా ఆలోచించింది.

భువన విజయమ్ ట్రైలర్ రిలీజ్
కమెడియన్, హీరో అయిన సునీల్ ఇప్పుడు మరోసారి ప్రధానపాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. భువన విజయమ్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమాకు యలమంద చరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మే 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

యాక్షన్ సీక్వెన్స్ తో జపాన్ న్యూ షెడ్యూల్
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ కార్తీ జపాన్ పై ఫోకస్ పెట్టాడు. ఈనేపథ్యంలో ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈకొత్త షెడ్యూల్ హైద్రాబాద్ లో నేడు…
ఓజి షూటింగ్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) మొదటి షెడ్యూల్ ఈరోజుతో ముగిసింది. గత నెలలో ఈసినిమా షూటింగ్ ముంబై లో ప్రారంభం కాగా ఈరోజు తో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని మేకర్స్ ప్రకటించారు.ఈసందర్భంగా పవన్ స్టిల్ ను రిలీజ్ చేశారు.ఈస్టిల్ లో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ఇక మొదటి షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరక్కించారు.తదుపరి షెడ్యూల్ మహాబలేశ్వర్ లో జరుగనుంది.ఈషెడ్యూల్ లో పవన్ అలాగే హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ లపై పాటను చిత్రీకరించనున్నారు.

ఛత్రపతి హిందీ ట్రైలర్ రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఛత్రపతి. ఈసినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుంది. ఇక ఈసినిమాతోనే బెల్లంకొండ శ్రీనివాస్కూడా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈసినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ రిలీజ్ కు మాత్రం చాలా ఆలస్యమైంది. ఫైనల్లీ మే 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ అయి సినిమాపై…

ఉగ్రం లో హై ఇంటెన్స్ రోల్ లో చూస్తారు-అల్లరి నరేష్
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరోలు అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట ఈ వేడుకకు హాజరయ్యారు.

విమానం నుండి కీలక పాత్రధారుల పోస్టర్లు రిలీజ్
సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రధారుల పోస్టర్లను వరుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే సముద్రఖని పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సముద్రఖని వీరయ్యగా అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

మేడే న విరూపాక్షకి షాకింగ్ కలెక్షన్స్
విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 ను దాటుకుని కలెక్షన్స్ రాబడుతుంది.రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. నిన్న మేడే న హాలిడే కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించి 3కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 32కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో 79.5కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది. ఇదే రన్ ను కొనసాగిస్తే ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.ఇప్పటికే ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను…

కస్టడీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్, పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 5వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

సీతారామం కు దాదా సాహెబ్ అవార్డ్
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా సీతారామం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమాలో హను రాఘవపూడి కథ ముఖ్యంగా హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయి పోయారు. ఇక కలెక్షన్స్ పరంగా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ అందించి మేకర్స్ కు మంచి లాభాలు అందించింది.

విశ్వక్ సేన్ గామి షూటింగ్ కంప్లీట్
రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో హిట్ ను అందుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే మధ్యలో పలు సినిమాల రిలీజ్ లతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆల్యమైం. ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుసుకుంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రయూనిత్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు…

NTR 30-హైలెట్ గా ఎన్టీఆర్ రెజ్లర్ రోల్
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా ఎన్టీ30. ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను చేస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అందరూ. ఇక కొరటాల శివ కూడా ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే సాలిడ్ కథను సిద్దం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఈవారం విడుదలవుతున్న సినిమాలు ఇవే
ఈ శుక్రవారం రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు అలాగే ఒక హాలీవుడ్ మూవీ థియేటర్లలోకి రానుంది. అవి..రామబాణం,ఉగ్రం సినిమాలు కాగా మరొకటి గార్డియన్స్ ఆఫ్ ది గాలక్సీ వాల్యూమ్ 3.

ఎన్టీఆర్ 30షూటింగ్ అప్డేట్
ఎన్టీఆర్ 30 ప్రారంభం ఆలస్యం అయ్యింది కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది.గత నెలలో షూటింగ్ మొదలుకాగా తాజాగా రెండో షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.ఈషెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.రామోజీఫిల్మ్ సిటీ లో స్పెషల్ గా వేసిన సెట్ లో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారు.ఈషెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నాడు.ఇందులో సైఫ్ విలన్ గా నటిస్తన్న సంగతి తెలిసిందే.

సెల్ఫిష్ ఫస్ట్ సింగిల్ దిల్ ఖుష్ సాంగ్ రిలీజ్
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

రెయిన్ బో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
రష్మిక మందన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సినిమాాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. తెలుగులో ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుంది రష్మిక. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైపోయింది. కొంతవరకూ షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ పై ఈసినిమాను భారీగా నిర్మిస్తున్నారు మేకర్స్.