సెల్ఫిష్ ఫస్ట్ సింగిల్ దిల్ ఖుష్ సాంగ్ రిలీజ్

selfish movie first single dil kush full song out

దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈపాట ప్రోమో ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ప్రోమోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇబల్లె బల్లె ఝలక్ నీదే బాలిక.. నీ వంద కోట్ల అందమంతా నాదిక అంటూ వచ్చే ఈ ఫుల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. గజల్స్ తో కూడిన మెలొడీగా ఉన్న ఈపాటను జావెద్ అలీ పాడగా రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు.

కాగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమామాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మణికందన్ పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 9 =