క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమాను 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కించాడు. అయితే రెండు పార్ట్ లుగా ఈసినిమాను రూపొందించాడు మణిరత్నం. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు దాదాపు 500 కోట్ల కలెక్షన్స్ సైతం రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ప్రభంజన సృష్టిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే సెకండ్ పార్ట్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కంటే కూడా సెకండ్ పార్టే ఇంకా బాగుంది అన్న ఫీడ్ బ్యాక్ రావడంతో ప్రేక్షకులు కూడా సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కేవలం రిలీజ్ అయిన రెండు రోజులకే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇప్పుడు నాలుగు రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరిపోయి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది.
The Chola legacy grows!#PS2 conquers the world with 200+ crores!
Book your tickets now!
🔗 https://t.co/XoZahSzNxVhttps://t.co/XIRDnHeF4c#PS2RunningSuccessfully #CholasAreBack#PS2 #PonniyinSelvan2 @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial… pic.twitter.com/kAC8ZWj6Ix— Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2023
కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రభు, శరత్ కుమార్, పార్దిబన్, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటించాారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ.. రవి వర్మన్, ఎడిటర్.. ఎ. శ్రీకర్ ప్రసాద్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: