విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.తెలుగు రాష్ట్రాల్లో పొన్నియిన్ సెల్వన్ 2 ను దాటుకుని కలెక్షన్స్ రాబడుతుంది.రెండవ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా సాలిడ్ రన్ ను కొనసాగిస్తోంది. నిన్న మేడే న హాలిడే కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగించి 3కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 32కోట్ల షేర్ ను క్రాస్ చేసింది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో 79.5కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది. ఇదే రన్ ను కొనసాగిస్తే ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.ఇప్పటికే ఈసినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో ఫుల్ రన్ లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Virupaksha's strong hold at the Box-office continues in the 2nd Week 🥳
UNSTOPPABLE on DAY 11 Grossing 79.5 Crores 💥🎉
Book your tickets#BlockbusterVirupakshahttps://t.co/HzG8SAAGh7@IamSaiDharamTej @iamsamyuktha_@karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/AZhaF1wfnH
— SVCC (@SVCCofficial) May 2, 2023
అటు ఓవర్సీస్ లో ఈసినిమా 1 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అనిపించుకుంది. మరోవైపు ఈనెల 5న విరూపాక్ష..తమిళ,మలయాళ,హిందీ భాషల్లో కూడా విడుదలవుతుంది.అందులో భాగంగా నిన్న ఈసినిమా హిందీ వెర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.ప్రస్తుతం విరూపాక్ష టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది.
ఇక ఈసినిమా సాయి ధరమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కలిగించింది.కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్,అజయ్,సాయి చంద్,కమల్ కామరాజు కీలక పాత్రల్లో కనిపించారు.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించగా ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























