సముద్రఖని ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విమానం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 9వ ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రధారుల పోస్టర్లను వరుగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే సముద్రఖని పాత్రకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సముద్రఖని వీరయ్యగా అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈసినిమాలో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాాలో అనసూయ సుమతి అనే పాత్రలో నటిస్తుంది. మరో కీలకపాత్రలో నటిస్తున్న రాహుల్ రామకృష్ణ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాహుల్ రామకృష్ణ కోటీ పాత్రలో నటిస్తున్నాడు. రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్ నటిస్తున్నాడు. ఇంకా డేనియల్ పాత్రలో ధనరాజ్ చేస్తున్నట్టు పోస్టర్లను రిలీజ్ చేశారు.
కాగాశివప్రసాద్ యానాల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఇంకా కిరణ్ కొర్రపాటి క్రియేట్ వర్క్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాబోతుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: