పలు సినిమాల్లో కమెడియన్ గా అలానే బుల్లి తెరపై పలు కామెడీ షోల్లో అలరించిన వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చూశాం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు, అనుబంధాల నేపథ్యంతో ఈసినిమా రావంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు ఈసినిమా చూసి కలిసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. అంత ప్రజాదారణ పొందింది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు ఇప్పటికే ఎన్నో అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఎన్నో అవార్డులు దక్కాయి. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది ఈసినిమాకు. తాజాగా సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేసిన భీమ్స్ సిసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెల్చుకున్నారు. ఇక తమ చిత్రానిక మరో అవార్డ్ వచ్చి చేరడంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తెలియచేసింది.
ఇది మన విజయం, మన కుటుంబ విజయం!! ❤️❤️#BheemsCeciroleo secures the Best Music Award at the 13th Dada Saheb Phalke Film Festival for his enchanting music in #Balagam 💥💥#BalagamGoesGlobal @VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu @LyricsShyam pic.twitter.com/90kTHGXz1t
— Dil Raju Productions (@DilRajuProdctns) May 2, 2023
కాగా ప్రియదర్శి ఈసినిమాలో కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, విజయలక్ష్మీ, స్వరూప కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈసినిమాకు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: