విశ్వక్ సేన్ గామి షూటింగ్ కంప్లీట్

vishwak sen gaami movie wraps up its shoot

రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో హిట్ ను అందుకున్నాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో గామి సినిమా కూడా ఒకటి. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టాడు విశ్వక్. అయితే మధ్యలో పలు సినిమాల రిలీజ్ లతో బిజీగా ఉండటం వల్ల ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆల్యమైం. ఫైనల్ గా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుసుకుంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రయూనిత్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. కాగా ఈసినిమాలో చాందిని చౌదరి, అభినయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వి సెల్యూలాయిడ్, కార్తీక్ శబరీష్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా కాకుండా విశ్వక్ రీసెంట్ గానే తన 11వ సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ,శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.