రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. కార్తీకి ఇది 25వ సినిమా. అయితే ఈసినిమాను రీసెంట్ గానే ప్రారంభించారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే ఈమధ్య కార్తీ పొన్నియన్ సెల్వన్ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉండటంతో జపాన్ షూట్ కు బ్రేక్ పడింది. ఇక పొన్నియన్ సెల్వన్ 2 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ కార్తీ జపాన్ పై ఫోకస్ పెట్టాడు. ఈనేపథ్యంలో ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈకొత్త షెడ్యూల్ హైద్రాబాద్ లో నేడు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ షెడ్యూల్స్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. అన్బు రవి పర్యవేక్షణలో ఈ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. సునీల్ కూడా ‘జపాన్’లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి డీవోపీగా పని చేస్తున్నారు. మానగరం, ఖైదీ, తానక్కరన్, విక్రమ్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్న ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ ‘జపాన్’ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: