అందరికీ నేను నచ్చాలని లేదు

Taapsee About Netizens Comments, Netizens Comments, Taapsee Pannu, Pavail Gulati, Anurag Kashyap, Taapsee Movies, Taapsee Latest Movie, Taapsee Upcoming Movie, Dobaaraa, Dobaaraa 2022, Dobaaraa Movie, Dobaaraa Update, Dobaaraa Latest News, Dobaaraa Telugu Movie, Dobaaraa Movie Live Updates, Dobaaraa Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అలా మాట్లేడే హీరోయిన్స్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఇక అలాంటి కోవలోకే వస్తుంది హీరోయిన్ తాప్సీ కూడా. ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైన తాప్సీ ఆతరువాత పలు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత తాప్సీ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తను చేస్తున్న దోబారా సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. దీనిలోభాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ ని మీ సినిమాని బాయ్‌కాట్‌ చేయమని నెటిజన్లు అంటున్నారు? దానికి మీ సమాధామం ఏంటని అడుగగా.. దానికి తాప్సీ ఇప్పుడు చాలా సినిమాలు బాయ్ కట్ ను ఎదుర్కొంటున్నాయి.. ప్రశ్నలు అడిగే ముందు కొంచం హోంవర్క్ చేసుకొని రావాలని తెలిపింది. ఇలానే మరో ఇంటర్వ్యూలో జరుగగా అలానే సమాధానం ఇవ్వడంతో తాప్సీ పై కామెంట్స్ మొదలయ్యాయి.

ఇక కామెంట్స్ పై తాప్సీ స్పందిస్తూ.. కెమెరా ముందు ఒకలాగ.. కెమెరా వెనుక ఒకలాగ నేను నటించలేను. నిజయతీగా ఉండటమే తెలుసు. నా మాటలు నచ్చని చాలామంది సోషల్‌ మీడియా వేదికగా ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారు. నేను చాలా బాధపడ్డా. సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని, నాపై వచ్చే వార్తల గురించి వెతకకూడదని నిర్ణయించుకున్నా. ఎదుటివారి పొగడ్తల కోసం నేను ఆరాటపడను. నాకు నచ్చినట్లు ఉంటాను. ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నా మనసుకు అనిపించింది మనస్ఫూర్తిగా మాట్లాడతాను. అందరికీ నేను నచ్చాలని లేదు. నటిగా నేను చేసే పనిని వాళ్లు మెచ్చుకుంటే చాలు అని తెలిపింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.