మొత్తానికి మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. ఈసినిమాపై ఏర్పడిన క్రేజ్ వల్ల ఈసినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో ఒక పాత్రలో పక్కా మాస్ లుక్‌లో కనిపించగా.. మరో లుక్‌లో స్టైలిష్ అండ్ క్లాస్‌గా కనిపించనున్నట్టు సమచారం. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Witness the Impact of
MassMaharaja @RaviTeja_offl ‘sMass Storm 💥#Dhamaka Trailer Out Now🤩#DhamakaFromDec23Watch Trailer Here👇https://t.co/jRtOJ983a7@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/Goli6xBfRc
— People Media Factory (@peoplemediafcy) December 15, 2022
యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఈసినిమాలో పెళ్లి సందడి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























