మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ ఫ్రాన్స్ దేశంలో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అనే పల్లవితో సాగే సెకండ్ సాంగ్ యొక్క ప్రోమో ని నిన్న మెగాస్టార్ చిరంజీవి చిన్న వీడియో బైట్ ద్వారా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాంగ్ ఫుల్ జోష్ తో సాగిన ఈ సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ అద్భుతంగా ఆలపించారని సమాచారం. ఫ్రాన్స్ లో పలు అందమైన లొకేషన్స్ మధ్య అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు శృతి హాసన్ అత్యద్భుతంగా స్టెప్స్ వేసిన ఈ సాంగ్ పై భారీ హైప్ నెలకొంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























