తమిళనాట ఘనవిజయం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని మాతృక దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజినల్ వెర్షన్ కి బాణీలు అందించిన గోవింద్ వసంత సంగీతమందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే.. ఈ నెల 7న రిలీజ్ కానున్న `జాను`కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ ఈ చిత్రానికి `క్లీన్ యు` సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా, ఈ సినిమా 151 నిమిషాలు (2 గంటల 31 నిమిషాలు) రన్ టైమ్ తో జనం ముందుకు రానుంది. మరి.. తమిళ ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ ప్రేమకథా చిత్రం.. తెలుగువారిని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























