డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. అదృష్టాన్ని ఎప్పుడూ తన పాకెట్ లో పెట్టుకొని తిరిగినట్టే దిల్ రాజు సినిమాలు అంటే మాగ్జిమమ్ హిట్ నే సొంతం చేసుకుంటాయి. చాలా తక్కువ సినిమాలే ప్లాప్ ను సొంతం చేసుకున్నాయి. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పటివరకూ స్ట్రెయిట్ సినిమాలే నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు రీమేక్ సినిమాలపై దృష్టి సారించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఏడాది వరుసగా మూడు రీమేక్ లతో రాబోతున్నాడు. అందులో ఒకటి శర్వానంద్, సమంత జంటగా ప్రేమ్ కుమార్ రూపొందించిన ‘జాను’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్ వచ్చిన క్లాసిక్ మూవీ ’96’ కు రీమేక్ ఇది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.
[custom_ad]




ఇంకొక సినిమా జెర్సీ రీమేక్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దిల్ రాజు. అర్జునరెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మరో రీమేక్ ‘పింక్’ రీమేక్. హిందీలో సూపర్ హిట్ ఐన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు రీమేక్ సినిమాలు చేయకుంటే నాకు ఈరోజు పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే డ్రీమ్ నెరవేరేది కాదు అంటున్నాడు దిల్ రాజు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా మే లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనితో ఈ సినిమాను కూడా మే నెలలో రిలీజ్ చేయాలనీ అలా ప్లాన్ చేశారు.
[custom_ad]
మొత్తానికి మూడు సినిమాలు మూడు డిఫరెంట్ స్టోరీలే. మరి ఈ ఏడాది ఓపెనింగ్ తోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దిల్ రాజుకు ఈ రీమేక్ లు ఎంత వరకూ సక్సెస్ అందిస్తాయో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: