దశాబ్దానికి పైగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వ్యాక్స్ స్టాట్యూ ఈ రోజు సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో ఆవిష్కరణ జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ల తరువాత టాలీవుడ్ నుండి కాజల్ ఈ గౌరవం పొందారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అరుదైన గౌరవం అందుకున్న కాజల్ సౌత్ ఇండియా లో మొదటి సినీనటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sweet sisters at @MadameTussauds Singapore🤗💕#KajalAggarwal #NishaAggarwal #MadameTussauds #KajalMadameTussauds pic.twitter.com/mikmmwjM4a
— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2020
[custom_ad]




మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో తన మైనపు ప్రతిమ ను ఆవిష్కరించిన కాజల్ ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రేక్షక, అభిమానుల ప్రశ్నలకు స్పాంటేనియస్ గా జవాబులు ఇచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లోతన స్టాట్యూ ఉండటం గ్రేట్ గా ఫీల్ అవుతున్నానని, అభిమానుల గురించి మాట్లాడుతూ .. అభిమానులు తన సపోర్టింగ్ సిస్టమ్ అని, ఆస్ట్రో నాట్ కావాలనే కోరిక ఉండేదని , సినీ నటి అయ్యానని, తన బెస్ట్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం తాను హ్యాపీ గా ఫీల్ అయ్యే హాలిడే అని , సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మీకలలను సాకారం చేసుకొమ్మని యువత కు కాజల్ సందేశం ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: