ఖైదీ`ని డైరెక్ట్ చేయ‌నున్న ప్ర‌ముఖ హిందీ ద‌ర్శ‌కుడు?

Rajkumar Santoshi To Direct Khaidi Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Khaidi,Khaidi Hindi Remake,Rajkumar Santoshi,Karthi Khaidi,Khaidi Movie Updates,Khaidi Telugu Movie Latest News

తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఖైదీ`(కార్తి క‌థానాయ‌కుడు)… హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తో క‌ల‌సి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిలయ‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే.. మాతృక‌ని రూపొందించిన లోకేష్ క‌న‌క‌రాజ్ నే హిందీ వెర్ష‌న్ ని కూడా రూపొందిస్తాడ‌ని రీసెంట్ గా కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే, ఇప్ప‌టికే ప‌లు ప్రాజెక్టుల‌కు క‌మిట్ కావ‌డంతో.. లోకేష్ ఈ రీమేక్ కి నో చెప్పాడ‌ని వినికిడి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ సంతోషి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తాడ‌ని తెలిసింది. `ఘాయ‌ల్`, `దామిని`, `పుకార్`, `ఖాకి` వంటి జ‌న‌రంజ‌క చిత్రాల‌ను తెర‌కెక్కించారు సంతోషి. ప్ర‌స్తుతం ఆయ‌న `బ్యాడ్ బాయ్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆ సినిమా విడుద‌ల కాబోతోంది. మ‌రి.. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించిన `ఖైదీ`.. హిందీనాట కూడా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =