అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

[custom_ad]




కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?
ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























