‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం “అల వైకుంఠపురములో”. సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో సత్తా చాటి దూసుకుపోతుంది. సినిమా విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా కొన్ని థియేటర్స్ ఫుల్ గానే నడుస్తూ కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులు కూడా భారీగానే అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లో ప్రసారం చేయనుండగా.. ఆ తర్వాత టెలివిజన్ లో ప్రసారం చేయనున్నారు. అంటే సినిమా విడుదలైన 87 రోజుల తర్వాత ఈ సినిమా ప్రసారం కానుంది. మరి థియేటర్‌లో ఈ సినిమా చూడలేని వాళ్లు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో చూడాలంటే ఏప్రిల్ 8వ వరకు ఆగాల్సిందే.
[custom_ad]
ఇక ఇదిలా ఉండగా త్వరలోనే ‘అల వైకుంఠపురములో’ హిందీలోకి శాటిలైట్ డబ్ అవుతుంది.. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘అల వైకుంఠపురములో’ హిందీలోకి శాటిలైట్ డబ్ చేస్తున్నామని.. తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా పలు భాషల్లోకి డబ్ చేస్తామని అంటున్నారు. అంతేకాదు హిందీలో సినిమా చేయాలనే కోరిక ఉందన్న ఆయన మంచి డైరెక్టర్, నిర్మాత దొరికితే కంటెంట్ ఉన్న సినిమాతో ఎంట్రీ ఇస్తానని… నా బాలీవుడ్ ఎంట్రీ చాలా పెద్ద మ్యాటర్ అని తెలిపాడు. మొత్తానికి కొడితే గట్టిగానే కొట్టాలి అన్నట్టు.. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ ద్వారా హిందీలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్టున్నాడు బన్నీ. అన్నీ కుదిరితే త్వరలోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ అవుతుందేమో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: