భారతీయ తెరపై పలు విదేశీ కథలు సంచలనం సృష్టించాయి. అయితే, ఇక్కడి సినిమాలు అక్కడ రీమేక్ అవడం అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రయత్నమే… `షీప్ వితౌట్ ఎ షెఫర్డ్`. మలయాళ చిత్రం `దృశ్యం`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా… గత ఏడాది డిసెంబర్ 13న విడుదలై… చైనాలో 2019 టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్ లో స్థానం దక్కించుకుంది. ఇప్పటికీ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొత్తమ్మీద… ఒక భారతీయ చిత్రం విదేశీ భాషలో రీమేక్ కావడమే కాకుండా కమర్షియల్ గానూ సెన్సేషన్ క్రియేట్ చేయడం రేర్ రికార్డ్ గానే చెప్పుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`దృశ్యం` కథ ఒక్క చైనాలో కాదు రీమేక్ అయిన ప్రతి వెర్షన్ లోనూ కాసుల వర్షం కురిపించింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో `దృశ్యం` పునర్నర్మితమై.. లాభాల బాట పట్టింది. ఇప్పుడు చైనాలోనూ సంచలనం సృష్టించడం వార్తల్లో నిలుస్తోంది.
[custom_ad]
మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ ఈ మలయాళ `దృశ్యం`ని రూపొందించాడు. 2013 డిసెంబర్ 19న విడుదలైన సదరు చిత్రం అప్పట్లో కేరళలో ఇండస్ట్రీ హిట్ గా నిలచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































