రాజమౌళి తన కథతోనే సమాధానం ఇస్తాడు..!

SS Rajamouli Speaks Only With His Story Says Tollywood Ace Writer Vijayendra Prasad

ఆర్ఆర్ఆర్ ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ రేంజ్ లో వున్నాయి. ఇక ఈ సినిమాపై చిత్రయూనిట్ చెపుతున్న మాటలు వింటే సినిమాపై ఆ అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. ఇటీవలే బాహుబలి మరియు ఆర్ఆర్ఆర్ యొక్క తమిళ వెర్షన్ డైలాగ్ లు రాసిన మాధన్ కార్కే… బాహుబలి కంటే పది రేట్లు గూజ్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయని.. ఆర్ఆర్ఆర్ ప్రారంభం నుండే అలాంటి సన్నివేశాలు ఉంటాయని చెప్పాడు. ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవన్ ఇద్దరికి ఒకే నిడివి ఉంటుందని.. అదిరిపోయే డైలాగ్స్ వుంటాయని చెప్పారు. ఇక ఇప్పుడు తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కథ చాలా సున్నితంగా ఉంటుందని అలాగే ఈ సినిమా విడుదల అయ్యే సమయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయని కానీ రాజమౌళి వాటన్నిటికీ తన కథనంతో అద్భుతమైన సమాధానం ఇస్తారని ఆయన తెలిపారు. దీనితో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాను థియేటర్ లో చూడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి విజయం వెనుక తండ్రి విజయేంద్రప్రసాద్ హస్తం కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే… రాజమౌళి తెరకెక్కించే సినిమాలన్నింటికీ దాదాపు కథా రచయిత ఆయనే.రాజమౌళి తెరకెక్కించిన సినిమాలతో పాటు మెర్సల్, భజరంగీ భాయ్‌జాన్ తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు కూడా రచయిత ఆయనే.ప్రస్తుతం పలు స్క్రిప్ట్ లు రాసే పనిలో వున్నాడు విజయేంద్ర ప్రసాద్.

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =