మంచి టైటిల్ ను మిస్ చేసుకున్న రాజమౌళి..!

SS Rajamouli Misses a Nice Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,SS Rajamouli Latest News,Director SS Rajamouli New Movie Title,SS Rajamouli Upcoming Film Title,SS Rajamouli Next Film Title

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. మన్యంలోని కాఫీ తోటల్లో వారం రోజుల పాటు క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదన్న సంగతి తెలిసిందే. అంతేకాదు RRR కు ఎలాంటి టైటిల్ అయితే బాగుంటుందో చెప్పమని.. టైటిల్స్ పంపమని అభిమానులను కోరాడు.ఆశ్ఛర్యంగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది చాలా టైటిల్స్ పంపించారు. తెలుగులో ఎక్కువగా ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ వినిపించింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఇదే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ‘రామ రావణ రాజ్యం’ టైటిల్ RRR చిత్రానికి దక్కే అవకాశం లేకుండా పోయింది. దీనికి కారణం.. ఈ టైటిల్ ని వి3 ఫిలిమ్స్ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. దీనితో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మరో టైటిల్ ని ఆలోచించుకోవలసిందే. మరి రాజమౌళి మంచి టైటిల్ ను మిస్ చేసుకున్నట్టే కదా. చూద్దాం ఏం టైటిల్ పెడతాడో..

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఒకటి కాదు రెండు కాదు ‘ఆర్ఆర్ఆర్’ ను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.