ప్లాస్మా దాతలు నిజమైన హీరోలు

Plasma Donors Are The Real Heroes Says Tollywood Ace Director SS Rajamouli

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లాస్మా దాతలే నిజమైన హీరోలు అంటున్నారు రాజమౌళి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకున్నా.. తీసుకోకపోయినా ఈ మహమ్మారి మాత్రం అందరికీ వ్యాప్తిస్తూనే ఉంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ కు షూటింగ్స్ వెళ్లకపోయినా.. వెళ్లినా కరోనా బారిన పడుతున్నారు. రాజమౌళి తో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. ఇప్పటివరకూ చాలా మంది సీలెబ్రిటీస్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా దాతల సన్మాన కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌తో కలిసి ప్లాస్మా దాతలను సన్మానించి, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడింది.. హోం క్వారెంటైన్.. డాక్టర్స్ సలహాలతో విజయం సాధించాము.. త్వరలోనే వైద్యులను సంప్రదించి ప్లాస్మాను డొనేట్‌ చేస్తామన్నారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్న వారికి ప్లాస్మా బ్రహ్మాస్త్రంగా పని చేస్తుందన్నారు. ప్లాస్మాను డొనేట్‌ చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ప్లాస్మా దాతలు నిజమైన హీరోలన్నారు. పోలీసులు అంటే కేవలం క్రైం జరిగినప్పుడు మాత్రమే వస్తారనుకున్న, కానీ అన్ని వేళల్లో ప్రజా సంక్షేమం కోరుకునే వారు రక్షభటులు అని తెలుసుకున్నానని చెప్పారు.

కాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 7 =