
ట్యాగ్ · 17 కథనాలు


రెట్రో.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి

అశోక్ గల్లా కొత్త చిత్రం ప్రారంభం

డైనమిక్ నిర్మాత చేతిలో దేవర రిలీజ్ హక్కులు

సితార చేతికి మమ్ముట్టి భ్రమయుగం తెలుగు రైట్స్

సితార చేతికి లియో

ప్రేక్షకులకు 'భీమ్లానాయక్' నిర్మాత క్షమాపణలు..!

'డీజే టిల్లు' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్

తగ్గేదేలే అంటున్న 'భీమ్లా నాయక్' మేకర్స్

"భీమ్లా నాయక్"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ లో మార్పు లేదు

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా

'డీజే టిల్లు' గా మారిన సిద్దూ

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్
పవన్-రానా సినిమాకు త్రివిక్రమ్

నెల్సన్ తో సినిమా ఉంటుంది - నాగవంశీ
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లు తమిళ హీరోలు ,డైరెక్టర్ల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి.అందులో భాగంగా విజయ్ తో ఇంతకుముందు దిల్ రాజు,వారిసు చేసి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.మైత్రి మూవీస్ ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది.అందులో అజిత్ తో ఒక సినిమా వుంది.ఇక నెక్స్ట్ హైయెస్ట్ సక్సెస్ రేట్ వున్న సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ సినిమా చేయనుంది.

రెట్రో.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి
వెర్సటైల్ స్టార్ సూర్య 'కంగువా' తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'రెట్రో'. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా ఇది సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.

అశోక్ గల్లా కొత్త చిత్రం ప్రారంభం
ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. ప్రతిభావంతుడైన యువ నటుడు అశోక్ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

డైనమిక్ నిర్మాత చేతిలో దేవర రిలీజ్ హక్కులు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న మోస్ట్ అవైడెట్ సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా, దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుండగా.. షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇక రిలీజ్ కు రెండు నెలలు టైమ్ ఉండగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్లలో వేగం పెంచుతున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. మరోవైపు పాటలను కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఫియర్ సాంగ్ రిలీజ్ కాగా ఆ పాట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

సితార చేతికి మమ్ముట్టి భ్రమయుగం తెలుగు రైట్స్
మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అది కూడా ఏ సినిమా పడితే ఆసినిమా కాదు. కథా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ హిట్లు కూడా అందుకుంటున్నాాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు భ్రమయుగం. ఈసినిమా అప్ డేట్లతోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. హార్రర్ థిల్లర్ నేపథ్యంలో పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ తో ఈసినిమా ను తెరకెక్కించారు. ఈసినిమా ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ హిట్ ను సొంతం చేసుకుంది.

సితార చేతికి లియో
వారసుడు తరువాత తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం లియో.రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.కేవలం 120రోజుల్లోనే సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

ప్రేక్షకులకు 'భీమ్లానాయక్' నిర్మాత క్షమాపణలు..!
ఒక్కోసారి తొందరపాటులో మాట్లాడిన మాటలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది భీమ్లానాయక్ నిర్మాతకు. ఇటీవల నాగవంశీ నిర్మాతగా.. సిద్దూ జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఈనేపథ్యంలో డీజే టిల్లు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ మీట్ లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.. ఈ సక్సెస్ మీట్ లో నాగవంశీ కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, `ఈ లెక్కలన్నీ మనలాంటి మేథావులకు కావాలి గానీ, ఆడియెన్స్ కి వాడిచ్చే 150రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500…

'డీజే టిల్లు' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం థమన్
టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు పెద్ద పెద్ద సినిమాలన్నింటికీ దాదాపు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్ సినిమా కూడా థమన్ ను తమ ప్రాజెక్ట్ లో జాయిన్ చేసుకుంది. నిజానికి ఇప్పటికే ఈసినిమా కోసం నార్త్ కు వేరే, సౌత్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అయినా కూడా ఈసినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం స్పెషల్ గా థమన్ ను తీసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. థమన్ పై ఎంత నమ్మకం ఉందో. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.

కన్ఫామ్.. వెంకీ అట్లూరీ తో ధనుష్ సినిమా.. టైటిల్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
తమిళ్ హీరోలు తమ సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగులోనే సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అందులో స్టార్ హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శేఖర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ధనుష్ తో శేఖర్ కమ్ముల ఒక థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

తగ్గేదేలే అంటున్న 'భీమ్లా నాయక్' మేకర్స్
సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ హీరో రానా ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ భీమ్లానాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమాకు ఇది రీమేక్ అని తెలిసిందే. ఇక ఈసినిమాను మన తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను యాడ్ చేసి తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు, టీజర్ చూస్తే ఈ విషయం ఇప్పటికే అర్థమైపోయింది. ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈసినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్.

"భీమ్లా నాయక్"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'భీమ్లా నాయక్' రిలీజ్ డేట్ లో మార్పు లేదు
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలే రిలీజ్ కు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే పోటీ మరీ ఎక్కువవుతుండటంతో వాటిలో కొన్ని సినిమాలు మాత్రం ఇప్పటికే బరి నుండి తప్పుకున్నాయి. అందులో పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సర్కారు వారి పాట, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఎఫ్ 3 సినిమాలు ఉన్నాయి. జనవరి 13న రిలీజ్ అనుకున్న మహేష్ 'సర్కారువారి పాట' విడుదల తేదీని ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసుకుంది. ఎఫ్ 3 ఫిబ్రవరి 25కు వెళ్లింది. ఇక ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా సంక్రాంతి పోటీ నుండి తప్పుకునే అవకాశం ఉందంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. దీనిపై కొద్ది రోజుల క్రితమే…

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా
ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే కదా. కొంతమంది హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్లే నిర్మించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా యంగ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు, సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల తన బ్యానర్ స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేయడానికి సిద్దమైపోయాడు. ఇంతకు ముందు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు తన సొంత…

'డీజే టిల్లు' గా మారిన సిద్దూ
కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సిద్దూ జొన్నలగడ్డ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు సడెన్ గా ఈసినిమా టైటిల్ ను మార్చారు చిత్రయూనిట్. నరుడి బ్రతుకు నటన అంత క్యాచీగా లేదని ఈసినిమాకు డీజే టిల్లుగా మార్చి దీనిని అధికారికంగా ప్రకటించారు కూడా. డీజే టిల్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అట్లుంటది మనతోని అనే ట్యాగ్ ను కూడా యాడ్ చేశారు. దీంతో…

కప్పేల రీమేక్ లాంచ్ చేసిన త్రివిక్రమ్
‘ప్రేమమ్’, ‘అయ్యప్పనుమ్ కొషియుం’ తరవాత సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న మరో మాలయాళ సినిమా రీమేక్ కప్పేల. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించి తమ నటనతో ఫిదా చేసేశారు. 2020 లో అతిపెద్ద విజయం అందుకున్న సినిమాల జాబితాలో ఈసినిమా కూడా ఒకటి. ఇక ఇప్పుడు ఈసినిమాను కూాడా రీమేక్ చేస్తున్నారు.

'రంగ్ దే' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది ‘భీష్మ’ తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు రంగ్ దే సినిమాతో వస్తున్నాడు. యంగ్ హీరో నితిన్, కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మార్చి 26న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ నురిలీజ్ చేశారు.
పవన్-రానా సినిమాకు త్రివిక్రమ్
సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియనుమ్' సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ హీరో రానా నటిస్తున్న సంగతి కూడా విదితమే. బిజు మీనన్ పాత్రను తెలుగులో పవన్ కల్యాణ్ చేస్తుండగా.. రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.