ఒక్కోసారి తొందరపాటులో మాట్లాడిన మాటలు వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏర్పడింది భీమ్లానాయక్ నిర్మాతకు. ఇటీవల నాగవంశీ నిర్మాతగా.. సిద్దూ జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక ఈనేపథ్యంలో డీజే టిల్లు సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ మీట్ లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.. ఈ సక్సెస్ మీట్ లో నాగవంశీ కలెక్షన్ల గురించి మాట్లాడుతూ, `ఈ లెక్కలన్నీ మనలాంటి మేథావులకు కావాలి గానీ, ఆడియెన్స్ కి వాడిచ్చే 150రూపాయలకు వాడు నవ్వుకున్నాడా? లేడా అనేది సరిపోతుంది. వాడిచ్చే 150 రూపాయలకు 1500 విలువ నవ్వించాం. అదే చాలు వాడికి. వాడు హ్యాపీ` అని ఏక వచనంతో సంబోధించారు. దీంతో నాగవంశీ పై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు మొదలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ కామెంట్లపై స్పందిస్తూ చివరికి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. ఇందులో నాగవంశీ చెబుతూ, ప్రేక్షకులంటే మాకెంతో గౌరవం. వారే ఏ నిర్మాణ సంస్థకైనా బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో `డీజే టిల్లు` విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షుకలను ఏక వచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించడం వల్లే. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్టే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం. వారే మా బలం` అనితెలిపారు. మరి ఇప్పటికైనా ఈ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూద్దాం..
— Naga Vamsi (@vamsi84) February 18, 2022




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: