వెర్సటైల్ స్టార్ సూర్య ‘కంగువా’ తర్వాత హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘రెట్రో’. సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. కాగా ఇది సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న సినిమా కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని కమర్షియల్ అప్పీల్‌తో గ్రిప్పింగ్ కథనంతో తెరకెక్కిస్తున్నాడు. గతేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టైటిల్ టీజర్ ద్వారా రెట్రో వరల్డ్ గ్లింప్స్ ని పరిచయం చేసింది. ఇంటెన్స్ యాక్షన్, రొమాన్స్ , ఎమోషనల్ డెప్త్‌ను బ్లెండ్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో సూర్య ఇంతకుముందెన్నడూ చేయని పాత్రను చేస్తున్నాడు.
ఫెరోషియస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో సూర్య నటిస్తుండగా.. ఆయన సరసన కన్నడ భామ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మే 1న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. రెట్రో సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఈ క్రమంలో తెలుగు రైట్స్ ను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపింది.
శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ విజువల్ గ్రాండియర్‌ను అందించనుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్, యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ ని ఎలివేట్ చేయనుంది. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: