
ట్యాగ్ · 14 కథనాలు


ఫ్యాన్స్ కు సమంత న్యూ ఇయర్ విషెస్

భాష సమస్య కాదు- సమంత
నటనకు కేరాఫ్ అడ్రస్ - మీరు మెచ్చిన 'సామ్' సినిమా
బయోపిక్ మూవీ లో సమంత ?
యన్టీఆర్ 30.. కీలక పాత్రలో సమంత?

ఒకే చిత్రంలో నయనతార, సమంత
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?
తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?
హారర్ థ్రిల్లర్ లో సమంత?
`పింక్` రీమేక్ లో సామ్?

సమంత సందడే సందడి

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?

నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్
సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్లు రావడం కామన్ గా ఉండేదే. ఇక సెలబ్రిటీలు కూడా వారి కామెంట్లపై స్పందించాలి అనుకుంటే స్పందిస్తారు.. లేకపోతే లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం ధీటుగానే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంతకు అయితే ఇది ఎప్పుడూ ఉండేదో. నెటిజెన్ల కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటుంది సమంత. ఇక తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సామ్. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగానే నిన్న శాకుంతలం ట్రైలర్ ను…

ఫ్యాన్స్ కు సమంత న్యూ ఇయర్ విషెస్
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో సమంత నటిస్తున్నారు.

భాష సమస్య కాదు- సమంత
సూపర్ హిట్ "ఏ మాయ చేసావె " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సమంత టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. "పుష్ప "మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు…
నటనకు కేరాఫ్ అడ్రస్ - మీరు మెచ్చిన 'సామ్' సినిమా
ఏం మాయ చేసావే సినిమాతో తన నటనతో అందరినీ మాయ చేసి.. దూకుడు సినిమాతో దూకుడిని పెంచి... వరుస హిట్స్ తో దూసుకుపోతూ.. యూటర్న్ సినిమాతో మహిళా ప్రాధాన్యత సినెమాలకు యూ టర్న్ తీసుకొని.. ఇటీవల జాను సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో జానుగా మిగిలిపోయిన హీరోయిన్ సమంత. మొదటినుండి విభిన్నమైన కథలతో.. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా తను ఉంటే చాలు సినిమా హిట్టే అన్న పేరు తెచ్చుకొని అతి తక్కువ కాలంలోనే సార్ హీరోయిన్ గా ఎదిగింది సమంత. నిజానికి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నట్టు ఉంటది హీరోయిన్ కెరీర్. కానీ సమంత విషయంలో అది కూడా రివర్స్ అయింది. పెళ్ళైన తర్వాత కూడా సామ్ వరుస…
బయోపిక్ మూవీ లో సమంత ?
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఒక బయోపిక్ మూవీ ని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నాటిక్ సింగర్, యాక్టి విస్ట్ , స్కాలర్ బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ ని రూపొందించనున్నారు. నాగరత్నమ్మ క్యారెక్టర్ కు సూటబుల్ యాక్ట్రెస్ కై సింగీతం ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అనుష్కను సంప్రదించగా డేట్స్ ప్రాబ్లెమ్ తో సెట్ కాలేదు. రీసెంట్ గా ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత ను సంప్రదించగా స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
యన్టీఆర్ 30.. కీలక పాత్రలో సమంత?
యంగ్ టైగర్ యన్టీఆర్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్... మరోసారి జట్టుకడుతున్న సంగతి తెలిసిందే. `అరవింద సమేత` తరువాత ఈ ఇరువురి కలయికలో వస్తున్న సదరు కొత్త చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఒకే చిత్రంలో నయనతార, సమంత
ఇద్దరు అగ్ర కథానాయకులు కలసి నటిస్తే ఎంత కనువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయికలు జట్టుకట్టినా అంతే రసవత్తరంగా ఉంటుంది. అలాంటి కనువిందునే కలగించబోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ తమిళ సినిమాలో దక్షిణాది అగ్ర తారలు నయనతార, సమంత తొలిసారి కలసి నటించబోతున్నారు.
`కర్తవ్యం` దర్శకుడితో సమంత చిత్రం?
`యూటర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ సమంత... మరో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివరకెన్నడూ పోషించని ఓ వైవిధ్యభరితమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలిసింది.

"మహాసముద్రం " మూవీ హీరోయిన్ సమంత ?
బ్లాక్ బస్టర్ "RX 100"మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో "మహాసముద్రం " మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ మూవీ లో శర్వానంద్ కు జోడీ గా సమంత ఎంపిక అయ్యారని సమాచారం. హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన "96 " మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందింది.
తానే నిర్మాతగా హారర్ థ్రిల్లర్ లో సామ్..?
పెళ్ళైన తర్వాత సమంత వైవిధ్యమైన కథలతో.. వరుస హిట్లతో .. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ యేడాది మొదట్లో నాగ చైతన్యతో చేసిన ‘మజిలీ’ సినిమా, రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబి’ కూడా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. సమంత ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న తమిళ సినిమా '96' రీమేక్‌లో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది. వీటితో పాటు ఈమె `ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
హారర్ థ్రిల్లర్ లో సమంత?
`యూ టర్న్`(2018), `ఓ బేబి`(2019)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ సమంత. ఈ పరంపరలోనే వచ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వల్ హారర్ థ్రిల్లర్ తో పలకరించబోతోందట ఈ కుందనపు బొమ్మ.
`పింక్` రీమేక్ లో సామ్?
ఎమోషనల్ కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన హిందీ చిత్రం `పింక్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మాతృకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. `ఎంసీఏ` దర్శకుడు వేణు శ్రీరామ్ రూపొందించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళనుంది.

సమంత సందడే సందడి
సమంత… టాలీవుడ్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్న ఈ చెన్నై బ్యూటీ… ఈ సంవత్సరం కూడా ‘మజిలీ’ రూపంలో ఇప్పటికే ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇదే జోష్‌లో… ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా వరుసగా మూడు నెలల్లో విడుదల కావడం విశేషం.

మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో సమంత?
వరుస విజయాలతో కెరీర్ లో దూసుకుపోతున్న అగ్ర కథానాయిక సమంత.. ఈ వేసవిలో 'మజిలీ', 'ఓ బేబీ' చిత్రాలతో తెలుగునాట సందడి చేయబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించబోతోంది సామ్. ఇదిలా ఉంటే.. మరోవైపు కొత్త సినిమాలను పట్టాలెక్కించే పనిలోనూ బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. తమిళంలో ఘన విజయం సాధించిన '96' రీమేక్ లో కథా నాయికగా నటించబోతుంది సామ్. అంతేకాదు... మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లోనూ ఈ అందాల తార నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.