ఇద్దరు అగ్ర కథానాయకులు కలసి నటిస్తే ఎంత కనువిందుగా ఉంటుందో… ఇద్దరు అగ్ర నాయికలు జట్టుకట్టినా అంతే రసవత్తరంగా ఉంటుంది. అలాంటి కనువిందునే కలగించబోతున్న చిత్రం… `కాదు వాక్కుల రెండు కాదల్`. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ఈ తమిళ సినిమాలో దక్షిణాది అగ్ర తారలు నయనతార, సమంత తొలిసారి కలసి నటించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
నయన్, సామ్… దశాబ్దానికి పైగా నాయికలుగా రాణిస్తున్నా, కలసి నటించిన సందర్భం లేకపోవడంతో ఈ చిత్రంపై ఎనలేని ఆసక్తి నెలకొంది. నయన్ ప్రియుడు, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి వచ్చే అవకాశముంది. మరి.. నయన్, సామ్ ఫస్ట్ కాంబో… ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి. త్వరలోనే `కాదు వాక్కుల రెండు కాదల్`లో నయన్, సామ్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: