కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ranveer Singh

ట్యాగ్ · 16 కథనాలు

Singham Again Trailer Out Now
ట్రైలర్ & టీజర్

సింగమ్ అగైన్ 5నిమిషాల ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Deepika Padukone and Ranveer Singh Shares Glimpses From Pregnancy Photoshoot
ట్రైలర్ & టీజర్

రణ్‍వీర్‌తో దీపికా మెటెర్నిటీ ఫొటోషూట్.. నెట్టింట వైరల్

బాలీవుడ్‍ స్టార్ పెయిర్ రణ్‍వీర్ సింగ్, దీపికా పదుకొణే త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న దీపికా ఈ నెలలోనే ప్రసవించనున్నారని సమాచారం. ఈ తరుణంలో దీపికా భర్త రణ్‍వీర్‌తో కలిసి మెటర్నిటీ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఇందులో ఆమె తన బేబీ బంప్‍ను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. గ‌ర్భంతో దిగిన ఈ ఫోటోల‌ను బ్లాక్ అండ్ వైట్‍ కలర్‌లో తన ఇన్‍స్టాగ్రామ్‍ వేదికగా పోస్ట్ చేసింది దీపిక.

Srikanth Mవాట్సాప్
ram charan and deepika padukone worked together for new project
సినిమా వార్తలు

చరణ్-దీపికా సీక్రెట్ ప్రాజెక్ట్

ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కోసం సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా తమ అభిమాన హీరోలు పలానా హీరోయిన్ తో చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి కాంబినేషన్ లో రామ్ చరణ్-దీపికా పదుకొనేది కూడా ఒకటి. దీపికా పదుకునే ఇప్పటికే ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది. ఇక ఆమధ్య మహేష్-దీపికా కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవి వార్తలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా రామ్ చరణ్-దీపికా పదుకొనే కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే ఇది సినిమా కోసం కాదనుకోండి. అసలు సంగతేంటంటే..

TFN Adminవాట్సాప్
Ranveer Singh Plans To Remake Krack Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ranveer Singh,Hero Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh Krack,Ranveer Singh Krack M
సినిమా వార్తలు

క్రాక్ రీమేక్ ప్లాన్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో?

సౌత్ సినిమాలకు నార్త్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఇక్కడ హిట్ అయిన సినిమాలను అక్కడ రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఎన్నో సినిమాలు నార్త్ లో రీమేక్ అయ్యాయి.. అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఆ బ్లాక్ బస్టర్ మరేదో కాదు క్రాక్ సినిమా. య‌దార్ధ సంఘ‌ట‌న‌ల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. అప్పటికే వరుస ఫ్లాప్స్ తో ఉన్న రవితేజకు ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా ఎక్కడా రాజీపడకుండా సాలిడ్ కలెక్షన్స్ అందించింది.

TFN Adminవాట్సాప్
Samantha to work with Ranveer Singh?,Does Samantha Hint About Collaborating With Ranveer Singh?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Latest
సినిమా వార్తలు

రణవీర్ సింగ్ తో సామ్ ప్రాజెక్ట్..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సమంత ఇంకా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గానే కొనసాగిస్తుంది. కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నా సమంత కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఇక వివాహా బంధం నుండి విడిపోయిన తరువాత సమంత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గానే తమిళ్ తోపాటు తెలుగులో కూడా రూపొందించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చంది. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా…

TFN Adminవాట్సాప్
Puri Jagannadh and Charmee Kaur with Ranveer Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Charmee Kaur,Puri Jagannadh,Ranveer Singh,Puri Jagannadh,Director Puri Jagannadh with R
సినిమా వార్తలు

"రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ "మూవీ సెట్స్ లో

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే. "లైగర్" సినిమా నిర్మాణ క్రమంలో కరణ్ జోహార్ తో పూరి, ఛార్మిలకు మంచి అనుబంధం ఏర్పడింది.

Team TFNవాట్సాప్
Ranveer Singh Interesting Comments on Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ranveer Singh,Ranveer Singh Comments on Ram charan,Bollywood Hero Ranvee
సినిమా వార్తలు

రామ్ చరణ్ పై బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఆసక్తికర కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "#RC 15 "మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "#RC 16 "మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం " మూవీ మార్చి 25 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Here’s An Interesting Line Up Of Sports Backdrop Movies Releases In December,Sports Backdrop Movies,Sports Movies,Sports Backdrop Movies In December,December Telugu Movie Release,December Sports Backdrop Telugu Movies,December 2021 Telugu Movies,2021
సినిమా వార్తలు

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Hero Sumanth Lends His Voice For Ranveer Singh's 83 Movie Telugu Version,Telugu Filmnagar,Latest Movies 2021,Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranveer Singh Upcoming Movie,Ranveer Singh Next Movie,Ranveer Singh Upcoming Proje
సినిమా వార్తలు

"83 " మూవీ లో రణ్ వీర్ సింగ్ కు సుమంత్ వాయిస్

కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకొనే జంటగా 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "83 " హిందీ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ మూవీ లో ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్, ఆయన భార్యగా దీపికా పడుకొనే నటించారు. ప్రీతమ్ సంగీతం అందించగా జూలియస్ పసికియం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. "83 " మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Ranveer Singh Starrer 83 Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Movies 2021,Latest Movie Teasers,New Movie Teaser,New Movie Teasers 2021,Ranveer Singh,Hero Ranveer Singh,Actor Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh New Movie,Ranvee
ట్రైలర్ & టీజర్

'83' టీజర్ రిలీజ్

కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రణ్ వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ‘‘83’’ అనే టైటిలోతో ఈను సినిమా వస్తుంది. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పు డో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల రిలీజ్ కు బ్రేక్ పడింది. ఫైనల్ గా డిసెంబ‌ర్ 24న రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ స్టార్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
Shalini Pandey Looks Forward For Her First Bollywood Movie Release,Ranveer Singh,Jayeshbhai Jordaar,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Actress Shalini Pandey,Sh
సినిమా వార్తలు

తొలి బాలీవుడ్ మూవీ రిలీజ్ కై ఎదురుచూస్తున్నా-షాలిని పాండే

సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన షాలిని పాండే , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "మహానటి ", "118 "మూవీస్ తో షాలిని ప్రేక్షకులను అలరించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రణ్ వీర్ సింగ్ , షాలిని పాండే జంటగా తెరకెక్కిన "జ‌యేశ్ భాయ్ జోర్దార్" మూవీ విడుదలకుసిద్ధంగా ఉంది. ఈ మూవీ తో షాలిని బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. కరోనా కారణంగా ఈ మూవీ రిలీజ్ డిలే అయ్యింది.

Team TFNవాట్సాప్
Mega Star Ram Charan and Shankar Movie Launch Ceremony Takes Place In A Grand Way Today,Ranveer Singh,Ram Charan,Mega Powerstar Ram Charan,Actor Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram C
సినిమా వార్తలు

రామ్ చరణ్-శంకర్ మూవీ గ్రాండ్ లాంచ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు ఈసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఆ డేట్ రానే వచ్చేసింది. ముందునుండి అనుకుంటున్నట్టే నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈకార్యక్రమానికి చిత్రయూనిట్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు.

TFN Adminవాట్సాప్
Ace Director Shankar Announces Anniyan Movie Hindi Remake With Ranveer Singh,Telugu Filmnagar,Telugu Film News 2021,Ranveer Singh Collaborates With Shankar For The Hindi Remake Of Vikram's Anniyan,Ranveer Singh To Star In Hindi Remake Of Director Sha
సినిమా వార్తలు

ర‌ణ్‌వీర్ తో 'అపరిచితుడు' రీమేక్

సౌత్ సినిమాలు ఇప్పుడు చాలానే హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ సినిమాకూడా రీమేక్ అవ్వడానికి సిద్దంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వచ్చిన సినిమా అపరిచితుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. అవినీతి అంటే ఇష్టపడని పాత్రలో స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా మూడు పాత్రల్లో అద్భుతంగా నటించిన చియాన్ విక్రమ్ నటనకు పట్టాం కట్టారు అందరూ. ఇక ఇప్పుడు ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేయనున్నాడు శంకర్. ఈవిషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా బిగ్ బ్ర‌ద‌ర్ మహేష్ జెంటిల్‌మెన్

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. థ‌మ్స్ అప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్త్నున్నారు. తెలుగులో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, హిందీలో స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో బాలీవుడ్ మూవీలో పూజాహెగ్డే

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం "రాధేశ్యామ్ ", మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. బాలీవుడ్ లో పూజాహెగ్డే నటించిన "హౌస్ ఫుల్ 4" మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న "కభీ ఈద్ కభీ దివాలీ " మూవీ కథానాయికగా ఎంపిక అయిన పూజాహెగ్డే మరో బాలీవుడ్ మూవీ కి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పీరియాడిక‌ల్ డ్రామాగా ఎన్టీఆర్ 31 మూవీ.. విలన్ గా రణవీర్ సింగ్..?

స్టార్ హీరో సినిమా అంటే రూమర్స్ రావడం కామన్ థింగ్. ఏం చేసిన వాటిని ఆపడం కష్టం. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పై కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటే బయటకు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. గత రెండేళ్లుగా మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూనే ఉంది. దాదాపు చివరి దశకు రాగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది.

TFN Adminవాట్సాప్

షేర్