బాలీవుడ్ లో మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి గా వస్తున్న సినిమా సింగమ్ అగైన్.సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు అక్కడ వసూళ్ల వర్షం కురిపించాయి దాంతో సింగమ్ అగైన్ పై మొదటి నుంచి భారీ అంచనాలు వున్నాయి.వీటికి తోడు రోహిత్ శెట్టి సినిమాలకు అక్కడ సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది.ఇక ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.దీన్ని ఏకంగా అటు ఇటు గా 5 నిమిషాలు కట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ను పరిచయం చేశారు.అజయ్ దేవగణ్ ,కరీనా కపూర్ జంటగా నటిస్తుండగా దీపికా పదుకోన్ ,రణ్వీర్ సింగ్ ,టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ పోలీస్ క్యామియో రోల్స్ లో కనిపించనున్నారు.అర్జున్ కపూర్ విలన్ పాత్ర చేస్తున్నాడు.తన లుక్ బాగుంది.భారీ మల్టీ స్టారర్ గా వస్తుంది.ఇక ట్రైలర్ లో ఆల్మోస్ట్ స్టోరీ ని రివీల్ చేశారు.దీనికి రామాయణం బ్యాక్ డ్రాప్ ను జోడించారు.
ట్రైలర్ ను మొత్తం యాక్షన్ తో నింపేశారు.చూస్తుంటే హిందీ జనాలకు బాగానే కనెక్ట్ అయ్యేలా వుంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్.ఓవరాల్ గా ట్రైలర్ అయితే అంచనాలకు తగ్గట్లే వుంది.దాంతో భారీ ఓపెనింగ్స్ ఖాయం.జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈసినిమా నవంబర్ 1న విడుదలకానుంది.మరి రిలీజ్ తరువాత సింగమ్ అగైన్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























