రణవీర్ సింగ్ తో సామ్ ప్రాజెక్ట్..!

Samantha to work with Ranveer Singh?,Does Samantha Hint About Collaborating With Ranveer Singh?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Samantha,Actress Samantha,Samantha Latest Movie Updates,Samantha Movie Updates,Samantha Upcoming Movies,Samantha New Movie Updates,Samantha Hint About Collaborating with Ranveer Singh, Samantha with Ranveer Singh,Ranveer Singh,Bollywood Star Ranveer Singh,Ranveer Singh Movie Updates,Samantha and Ranveer Singh Collaborations,Samantha Sakhi Movie Updates,Samantha With Vijay Deverakonda

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సమంత ఇంకా తన కెరీర్ ను సక్సెస్ ఫుల్ గానే కొనసాగిస్తుంది. కొత్త కొత్త హీరోయిన్స్ వస్తున్నా సమంత కు ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఇక వివాహా బంధం నుండి విడిపోయిన తరువాత సమంత తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. రీసెంట్ గానే తమిళ్ తోపాటు తెలుగులో కూడా రూపొందించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చంది. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. తెలుగులో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా షూటింగ్‌ను ఇప్ప‌టికే పూర్తి చేసింది. ఇంకా యశోద సినిమా కూడా చేస్తుంది. తెలుగుతో పాటు అటు తమిళ్, హిందీలో కూడా నటిస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా సామ్ తన సోషల్ మీడియా ద్వారా ఒక ఫొటోను షేర్ చేయగా అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ ఫొటో ఏంటంటే.. ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ తో ఉన్న ఫొటో ను సామ్ షేర్ చేసింది. ఈ ఫొటోలో సమంత ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ తో కనిపిస్తోంది.. అయితే రణవీర్ సింగ్ బ్లూ షర్ట్ తో క్యాజువల్ లుక్ లో కనిపిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వస్తుందా అన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. లేకపోతే మూవీ సెట్ లో క్యాజువల్ గా కలిశారా.. నిజంగానే వీరిద్దరి కాంబినేషన్ ఏదైనా సినిమా వస్తుందా సామ్ ఈరకంగా హింట్ ఇచ్చిందా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా పుష్ప సినిమా రిలీజ్ తరువాత తనకు సమంత సాంగ్ ఊ అంటావా మావ పాట అంటే చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఆ పాట అర్థం ఏంటో నాకు తెలియదు కానీ మ్యూజిక్ కు మాత్రం నేను చాలా కనెక్ట్ అయ్యా అని తెలిపాడు. మరోవైపు రణవీర్ కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా రోహిత్ శెట్టితో పాటు మరో రీమేక్ సినిమా కూడా చేస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − one =