మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “#RC 15 “మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “#RC 16 “మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో రామ్ చరణ్ పై బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల చిట్ చాట్ లో రామ్ చరణ్ గురించి రణ్ వీర్ మాట్లాడుతూ ..రామ్ చరణ్ ఒక మృగమనీ , చాలా హార్డ్ వర్క్ చేస్తారనీ, “మగధీర” మూవీ చూసినప్పటి నుంచి చరణ్ కు అభిమానిగా మారాననీ , ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































