ట్యాగ్ · 35 కథనాలు · పేజీ 2
చిరు-రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్..?
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?
నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్ కు నిర్మాత రానా ?

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రానా?
'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!
దగ్గుబాటి రానా నటనాప్రస్థానానికి పదేళ్ళు

రానా సమ్మర్ డబుల్ ధమాకా
జీవితం అంటే తెలుసుకున్నా - రానా దగ్గుబాటి
ట్రైబల్ లీడర్ బయోపిక్ లో రానా..!

రజినీ దర్శకుడితో రానా?

హాలీవుడ్ మూవీ లో రానా ?
'విరాట పర్వం' టీం కు తప్పిన ప్రమాదం..!
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
చిరు-రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్..?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున మురిపించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రేక్షకులను మైమరపించబోతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది.
ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరుతుంది..!
లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తున్నారు.. అయితే సోషల్ మీడియాద్వారా మాత్రం ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. ఇక సెలెబ్రిటీస్ కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూ.. వారి సినిమాల గురించి.. ఏం చేస్తున్నారు.. ఏం చేయబోతున్నారు.. ఇలా పలు విషయాలు గురించి.. పలు ఆసక్తికరమైన విషయాల గురించి చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా... రానాను రొమాంటిక్ హీరోగా చూడాలని ఉందనే కోరికను ఒక అభిమాని వ్యక్తం చేయగా, వచ్చే ఏడాది ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే…
రానా దగ్గుబాటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ ?
రానా దగ్గుబాటి పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆసక్తికర స్క్రిప్ట్స్, ఛాలెంజింగ్ రోల్స్ కు ప్రాధాన్యత నిచ్చే రానా ఇప్పటికే కంటెంట్ బేస్డ్ మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం "విరాటపర్వం" మూవీ లో హీరోగా నటిస్తున్న రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సమావేశమయ్యారు.
నాగ్ అశ్విన్ వెబ్ సిరీస్ కు నిర్మాత రానా ?
సక్సెస్ ఫుల్ "ఎవడే సుబ్రమణ్యం ? " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన నాగ్ అశ్విన్, ఆ మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ బ్లాక్ బస్టర్ "మహానటి" మూవీ తో నాగ్ అశ్విన్ క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. "#Prabhas 21" మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. కరోనా కారణంగా "#Prabhas 20" మూవీ డిలే కావడంతో "#Prabhas 21" మూవీ కూడా డిలే కానుంది, అందువల్ల నాగ్ అశ్విన్ ఒక వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశారు.

`అయ్యప్పనుమ్ కోషియుమ్`రీమేక్‌లో రానా?
మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రం... తెలుగులో రీమేక్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ మల్టీస్టారర్ మూవీని తెలుగులో నిర్మించనున్నాడని సమాచారం.
'అరణ్య' కోసం 30 కిలోల బరువు తగ్గిన రానా!
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
దగ్గుబాటి రానా నటనాప్రస్థానానికి పదేళ్ళు
ఒకవైపు కథానాయకుడిగా రాణిస్తూనే... మరోవైపు ప్రతినాయక పాత్రలతోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు యువ నటుడు దగ్గుబాటి రానా. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ దగ్గుబాటి వారసుడు... కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు... ‘లీడర్’, ‘నేను నా రాక్షసి’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘రుద్రమదేవి’, ‘ఘాజి’, ‘బాహుబలి: ది కంక్లూజన్’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయవంతమైన చిత్రాలలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విభిన్న భూమికల్లో ప్రేక్షకులను రంజింపచేసిన రానా... ఇటీవల మహానటుడు యన్టీఆర్ బయోపిక్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ…

రానా సమ్మర్ డబుల్ ధమాకా
ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడనిపించుకున్న దగ్గుబాటి రానా.. దాదాపు మూడేళ్ళ తరువాత కథానాయకుడిగా పలకరించబోతున్నాడు. అది కూడా... తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు.
జీవితం అంటే తెలుసుకున్నా - రానా దగ్గుబాటి
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన అరణ్యం నేపథ్యంలో రూపొందిన "అరణ్య" మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. హిందీ లో "హాథీ మేరే సాథీ ", తమిళంలో "కాడన్" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. శ్రియ పిల్ గోవింకర్ , విష్ణు విశాల్, పులకిత్ సామ్రాట్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు.
రిటైర్డ్ పోలీస్ అధికారి ట్రైనింగ్ లో రానా దగ్గుబాటి
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారథ్యంలో సక్సెస్ ఫుల్ మూవీ "నీదీ నాదీ ఒకే కథ "దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా 1990 ల కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో "విరాటపర్వం 1992"మూవీ రూపొందుతుంది. ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
సొంత ప్రొడక్షన్ లో యంగ్ హీరో సినిమా - క్లారిటీ ఇచ్చిన రానా..!
గతకొద్ది కాలంగా బ్రేక్ లో వున్న టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా ఇప్పుడు మళ్ళీ బిజీ కాబోతున్నాడు. ఇప్పటి వరకూ పెండింగ్ లో వున్న పనులతో బిజీ కాబోతున్నాడు. ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. హిందీ మూవీ హాథీ మేరే సాథీ మూవీ కి డబ్బింగ్ చెబుతున్నాను.. ఆ మూవీ మూడు భాషలలో రిలీజ్ కానుందని, మూడు భాషలలో డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదు.. మరోపక్క హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్నాను.. ఆ మూవీ కై కొన్ని సెట్స్ రూపొందిస్తున్నాం.. డిసెంబర్ నెలలో విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపాడు.
ట్రైబల్ లీడర్ బయోపిక్ లో రానా..!
కేవలం ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనలో ఉన్న టాలెంట్ ను చూపిస్తూ..కెరీర్ లో ముందుకు కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.

రజినీ దర్శకుడితో రానా?
పాన్ - ఇండియా యాక్టర్‌గా పేరుతెచ్చుకున్న రానా... ప్రస్తుతం పలు ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోలో హీరోగా నటిస్తూనే... మరో వైపు మల్టీస్టారర్ మూవీస్‌లోనూ సందడి చేస్తున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ప్రస్తుతం బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీస్ `హౌస్‌ఫుల్ 4` (అక్షయ్ కుమార్), `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` (అజయ్ దేవగణ్)లో నటిస్తున్న రానా... తాజాగా మరో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

హాలీవుడ్ మూవీ లో రానా ?
బాహుబలి సిరీస్ మూవీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రానా దగ్గుబాటి కి హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. కొంతమంది తమ ఇంగ్లిష్ మూవీ లో రానా ను నటింపచేయాలని రానా ను కలిసినట్టు, రానా కు ఉన్న సినిమాల కమిట్ మెంట్స్ కంప్లీట్ అయిన తరువాత ఇంగ్లిష్ మూవీ లోనటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.