ట్రైబల్ లీడర్ బయోపిక్ లో రానా..!

Rana to Act in Tribal Leader Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rana Daggubati Latest News,Hero Rana Daggubati Upcoming Movie News,Rana Daggubati Next Film Updates,#RanaDaggubati
Rana to Act in Tribal Leader Biopic

కేవలం ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కాకుండా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనలో ఉన్న టాలెంట్ ను చూపిస్తూ..కెరీర్ లో ముందుకు కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఓ ట్రైబల్ లీడర్ బయోపిక్ లో కూడా రానా నటించబోతున్నట్టు తెలుస్తోంది. కాలా డైరెక్టర్ రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండ జీవితం ఆధారంగా రంజిత్ ఈ బయోపిక్ ను 2020 లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడట. దీనిపై మరింత సమాచారం తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక రంజిత్ మరో మల్టీస్టారర్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రానా, సత్యరాజ్, ఆర్య కాంబినేషన్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో చూద్దాం…

[subscribe]

[youtube_video videoid=1Q_i14g_2T0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 4 =