ద‌గ్గుబాటి రానా న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌దేళ్ళు

Rana Daggubati Celebrates 10 Years Of His Film Journey In Tollywood

ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా రాణిస్తూనే… మ‌రోవైపు ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌తోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు యువ న‌టుడు ద‌గ్గుబాటి రానా. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ ద‌గ్గుబాటి వార‌సుడు… కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు… ‘లీడ‌ర్‌’, ‘నేను నా రాక్ష‌సి’, ‘బాహుబ‌లి: ది బిగినింగ్‌’, ‘రుద్ర‌మ‌దేవి’, ‘ఘాజి’, ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న భూమిక‌ల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేసిన రానా… ఇటీవ‌ల‌ మ‌హాన‌టుడు య‌న్టీఆర్ బ‌యోపిక్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో తన హావభావాలతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్నాడు. ఇక హిందీ చిత్ర‌సీమ‌లోనూ త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అలాంటి రానా సినీ యానంలో తొలి అడుగు… ‘లీడ‌ర్‌’(2010). అందులో ముఖ్య‌మంత్రి అర్జున్ ప్ర‌సాద్‌గా బాధ్య‌తాయుత‌మైన పాత్ర‌లో న‌టించి… మొద‌టి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన ఎ.వి.ఎం.ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 2010 ఫిబ్ర‌వ‌రి 19న విడుద‌లైన ‘లీడ‌ర్’ నేటితో ప‌ది వ‌సంతాలు పూర్తి చేసుకుంటోంది. అంటే… న‌టుడిగా రానా కెరీర్ మొద‌లై నేటితో ద‌శాబ్ద‌కాలం పూర్త‌వుతోంద‌న్న మాట‌. ఈ సంద‌ర్భంగా… మున్ముందు రానా మ‌రిన్ని వైవిధ్యభ‌రిత‌మైన పాత్ర‌ల‌తో ఆడియ‌న్స్‌ను అల‌రించాల‌ని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =