ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడనిపించుకున్న దగ్గుబాటి రానా.. దాదాపు మూడేళ్ళ తరువాత కథానాయకుడిగా పలకరించబోతున్నాడు. అది కూడా… తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. చివరసారిగా 2017లో విడుదలైన `నేనే రాజు నేనే మంత్రి` వంటి బ్లాక్ బస్టర్ లో కథానాయకుడిగా నటించిన రానా నుంచి ఆ తరువాత హీరోగా మళ్ళీ మరో సినిమా రాలేదు. అయితే అతిథి పాత్రలు, లేదంటే కీలక పాత్రల్లోనే రానా పలకరించాడు. కట్ చేస్తే… 2020 వేసవిలో ఏకంగా రెండు సినిమాల్లో కథానాయకుడిగా సందడి చేయనున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఏప్రిల్ 2న త్రిభాషా చిత్రం `అరణ్య` విడుదల కానుండగా.. వేసవిలోనే కథానాయకుడిగా నటించిన మరో చిత్రం `విరాట పర్వం` రాబోతోంది. మరి.. ఈ రెండు చిత్రాలతోనూ రానా విజయఢంకా మ్రోగిస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: