ట్యాగ్ · 35 కథనాలు · పేజీ 2
అన్నాత్తే.. 'రజినీ' కి విలన్ గా..!
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి
ఫ్రాన్స్ లో "దర్బార్ " మూవీ రీ రిలీజ్
జనవరి 14న రజినీకాంత్ 'అణ్ణాత్త'?
వరుసగా మూడోసారి రజినీకాంత్ సంక్రాంతి సందడి
రామోజీ ఫిల్మ్ సిటీలో రజినీకాంత్ సందడి

`మన్నవన్`గా రజినీకాంత్?

ఐ యామ్ ఆల్ రైట్ - రజనీకాంత్
ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది - రజనీకాంత్
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం
రజనీకాంత్ కు ప్రధాని మోడీ బర్త్ డే విషెస్
బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న "అపూర్వ రాగంగళ్" తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రజనీకాంత్ , కొన్ని సినిమాలలో నెగటివ్ క్యారెక్టర్స్ లో నటించినా తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని తిరుగు లేని హీరోగా మారారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పద్మ భూషణ్ , పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.
అన్నాత్తే.. 'రజినీ' కి విలన్ గా..!
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేస్తే ఓ పని అయిపోద్దని భావిస్తున్నారట చిత్రయూనిట్. దీనిలో భాగంగానే త్వరలోనే షూట్ ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి
టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకిన సంగతి కూడా విదితమే. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి... ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం…
ఫ్రాన్స్ లో "దర్బార్ " మూవీ రీ రిలీజ్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్, లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "దర్బార్ "తమిళ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరం జనవరి 9వ తేదీ "దర్బార్ " మూవీ తమిళ భాష తో పాటు తెలుగు , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది.
జనవరి 14న రజినీకాంత్ 'అణ్ణాత్త'?
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అణ్ణాత్త’. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
వరుసగా మూడోసారి రజినీకాంత్ సంక్రాంతి సందడి
సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అచ్చొచ్చిన సీజన్స్‌లో సంక్రాంతి ఒకటి. పొంగల్ బరిలో దిగిన రజినీ పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలోనే.. రజినీ తాజా చిత్రం 'అణ్ణాత్త' కూడా సంక్రాంతి సీజన్‌లోనే సందడి చేయనుంది. 'శౌర్యం' శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని.. తొలుత ఆయుధపూజ రోజున విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా…

రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టారే.. సినిమా కార్మికులకు 50 లక్షల విరాళం
కరోనా.. కరోనా.. కరోనా ఎక్కడ చూసినా ఈ మాట తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఎవరు మాట్లాడుకున్నా ఇఇ విషయం గురించే.. టీవీ లు పెట్టినా ఇదే న్యూస్.. ఇక ప్రజలైతే ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైతే లాక్ డౌన్ చేసేసారు. ఏదో కనీస అవసరాలు తీర్చుకోడానికి తప్పితే ప్రజలను బయటకు రానివ్వట్లేదు ప్రభుత్వ అధికారులు. స్కూల్స్, ఆఫీస్ లు, థియేటర్స్, మాల్స్ ఇలా అన్నీ మూతపడ్డాయి. షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సెలెబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉండి మంచిగా ఫ్యామిలీస్ తో గడుపుతున్నారు.
రజినీకాంత్ ని డైరెక్ట్ చేయనున్న రాఘవ లారెన్స్?
వరుస చిత్రాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు మీదున్నారు. గత ఏడాది సంక్రాంతికి `పేట`తోనూ.. ఈ సంవత్సరం సంక్రాంతికి `దర్బార్`తోనూ పలకరించిన రజినీ.. ఈ దసరాకి `అణ్ణాత్త` (తెలుగు టైటిల్ నిర్ణయించాల్సి ఉంది)తో సందడి చేయనున్నారు. ఆపై తన మిత్రుడు, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో తన 169వ సినిమా చేయనున్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో రజినీకాంత్ సందడి
ఈ సంక్రాంతికి `దర్బార్`తో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్... దీపావళికి మరో క్రేజీ ప్రాజెక్ట్ తో పలకరించేందుకు సన్నద్ధమవుతున్నారు. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య భూమికల్లో నటిస్తున్నారు.

`మన్నవన్`గా రజినీకాంత్?
ఈ ఏడాది సంక్రాంతికి `దర్బార్`తో సందడి చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్... ప్రస్తుతం `శౌర్యం` శివ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. మెరుపువేగంతో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఖుష్బూ, మీనా, కీర్తి సురేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతమందిస్తున్నాడు.

ఐ యామ్ ఆల్ రైట్ - రజనీకాంత్
డిస్కవరీ ఛానెల్ లో ప్రసారమయ్యే "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే. బ్రిటిష్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ ఈ ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం బేర్ గ్రిల్స్ ప్రధాని మోదీ తో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ఒక ఎపిసోడ్ రూపొందించారు. ప్రధాని మోదీ తరువాత ఇండియన్ సెలబ్రిటీ రజనీకాంత్ "మ్యాన్ వర్సెస్ వైల్డ్" ప్రోగ్రామ్ లో పాల్గొనడం విశేషం.
రజినీ కోసం మరోమారు ఎస్పీబీ ఇంట్రో సాంగ్
ఈ ఏడాది సంక్రాంతికి `పేట`తో పలకరించిన సూపర్ స్టార్ రజినీ కాంత్... వచ్చే సంవత్సరం ముగ్గుల పండక్కి `దర్బార్`తో సందడి చేయనున్నారు. ఈ లోపే... తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించారాయన. `శౌర్యం` శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... బుధవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం డి. ఇమాన్ స్వరసారథ్యంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఇంట్రో సాంగ్ ని ... రజినీ బృందంపై చిత్రీకరిస్తున్నారని సమాచారం.
ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది - రజనీకాంత్
ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "దర్బార్ " మూవీ తెలుగు, తమిళ భాషలలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "దర్బార్ " మూవీ ట్రైలర్ సందర్భంగా మీడియా సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ గా నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రజనీకాంత్ 168వ మూవీ ప్రారంభం
సన్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కీర్తి సురేష్ జంటగా సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో రజనీకాంత్ 168 వ మూవీ ఈ రోజు పూజ కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, మీనా, ఖుష్బూ, దర్శకుడు శివ, నిర్మాతలు హాజరయ్యారు.ఈ మూవీ లో మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
రజనీకాంత్ అరుదైన గౌరవం - ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ
తన విలక్షణమైన నటనతో.. డిఫరెంట్ మ్యానరిజమ్స్, స్టైల్స్ తో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింవ అవసరం లేదు సినీ లవర్స్ కి. ఇక ఈ వయసులో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అయన కెరీర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆయనకు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.