కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas

ట్యాగ్ · 656 కథనాలు · పేజీ 33

Ace Director Koratala Siva Teams Up Again With Darling Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Koratala Siva,Prabhas,Director Koratala Siva,Darling Prabhas,Koratala Siva Latest News,Koratala
సినిమా వార్తలు

మ‌రోసారి `మిర్చి` కాంబినేష‌న్?

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌. `మిర్చి`, `శ్రీ‌మంతుడు`, `జ‌న‌తా గ్యారేజ్`, `భ‌ర‌త్ అనే నేను`... ఇలా నాలుగు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన కొర‌టాల.. ప్ర‌స్తుతం త‌న ఐదో చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్ లో `ఆచార్య‌` పేరుతో రూపొందిస్తున్నాడు. ఆగ‌స్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది. ఆపై ఆరో చిత్రాన్ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తెర‌కెక్కించ‌డానికి శివ స‌న్నాహాలు చేస్తున్నాడు. అంతేకాదు.. కొర‌టాల శివ రూపొందించ‌బోయే 7వ చిత్రం కూడా ఇప్ప‌టికే సెట్ అయింద‌ట‌.

Team TFNవాట్సాప్
Prabhas 21 Going To Be Another Prestigious Movie In Prabhas Film Career
సినిమా వార్తలు

ప్ర‌భాస్ 21... మ‌రో చంద‌మామ క‌థ‌?

చంద‌మామ‌ క‌థల‌ త‌ర‌హాలో తెర‌కెక్కిన `బాహుబ‌లి` చిత్రాలు.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్ళాయి. డార్లింగ్ కి పాన్ - ఇండియా స్టార్ ఇమేజ్ ని క‌ట్ట‌బెట్టాయి. క‌ట్ చేస్తే... ఇప్పుడిదే త‌ర‌హాలో మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో `ప్ర‌భాస్ 21` రాబోతోంది. `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వైజ‌యంతీ మూవీస్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... చంద‌మామ క‌థ త‌ర‌హాలో తెర‌కెక్క‌నుందట‌. సైంటిఫిక్ ఫిక్ష‌న్ గా ఈ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్ని క‌థ‌నాలు వ‌చ్చినా... `పాతాళ భైర‌వి` త‌ర‌హాలో జ‌న‌రంజ‌క జాన‌ప‌ద చిత్రంగా `ప్ర‌భాస్ 21` ఉంటుంద‌ని వినికిడి.

Team TFNవాట్సాప్
Nag Ashwin About His Film With Prabhas,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas,Nag Ashwin,Director Nag Ashwin,Darling Prabhas New Film,#Prabhas21, Prabhas 21 Movie Updates, Prabhas 21 Telugu
సినిమా వార్తలు

పాన్ ఇండియా కాదు - పాన్ వరల్డ్ డార్లింగ్స్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందనున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. ఇక తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ ట్వీట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.. 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ట్వీట్ చేశారు. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడ‌టం స‌రికాదు...కొంతమంది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు... ప్ర‌భాస్ పాన్ ఇండియా రేంజ్‌ను ఎప్పుడో దాటేశారు... ఆయ‌న‌దిప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్థాయి అని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

ప్ర‌భాస్ తోనూ స‌క్సెస్ అందుకుంటారా?

బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో వైజ‌యంతీ మూవీస్ ఒక‌టి. దాదాపు అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఈ సంస్థ సినిమాలు చేసింది. తొలి త‌రంలో య‌న్టీఆర్, ఏయ‌న్నార్, కృష్ణ‌, శోభ‌న్ బాబు, కృష్ణంరాజు... రెండో త‌రంలో చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్... ఈ సంస్థ‌లో చిత్రాలు చేశారు. ఇక ఈ త‌రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేష్ బాబు, య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ వంటి స్టార్స్ తోనూ వైజ‌యంతీ మూవీస్ క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించింది.

Team TFNవాట్సాప్
Prabhas New Movie With Director Nag Ashwin,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas New Movie,Director Nag Ashwin Upcoming projects,Prabhas Nag Ashwin Movie,Darling Prabhas,Prabhas,Prabhas New
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ కన్ఫామ్

గతకొద్ది రోజులుగా నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్తలపై క్లారిటీ వచ్చేసింది. వైజయంతి మూవీస్ చెప్పినట్లే భారీ అనౌన్స్మెంట్ తో ముందుకు వచ్చేసింది. మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉంటున్నట్టు వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Prabhas 20 Becomes The First Film To Set This Unique Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,#Prabhas20,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Project News,Pr
సినిమా వార్తలు

#Prabhas 20 - ఆ విషయంలో కూడా ఇండియన్ ఫస్ట్ ఫిలిం ఇదే

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే 'జాన్' అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడంతో ఈ సినిమాకు 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Sends Out Valentines Day Wishes On Social Media
సినిమా వార్తలు

పూజ హెగ్డే వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు

సక్సెస్ ఫుల్ "ఒక లైలా కోసం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూజ హెగ్డే అనతి కాలం లోనే టాలీవుడ్ స్టార్ హీరోస్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లతో సూపర్ హిట్ మూవీస్ లో నటించి, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'

ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…

TFN Adminవాట్సాప్
Prabhas 20 First Look To Release On Ugadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,Prabhas 20 First Look,Prabhas,#Prabhas20,Young Rebel Star Prabhas 20 First Look To Release On Ugadi,Ugadi,Pr
ఫస్ట్ లుక్

ఉగాదికి `ప్ర‌భాస్ 20` ఫ‌స్ట్ లుక్?

`వ‌ర్షం`, `డార్లింగ్`.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లోని ప్రేమికుడ్ని ఆవిష్క‌రించిన చిత్రాలివి. ఆ త‌రువాత మ‌ళ్ళీ పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రాలు చేయ‌ని మ‌న `బాహుబ‌లి` స్టార్.. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఓ ల‌వ్ స్టోరీ చేస్తున్నాడు. `జిల్` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ కి జోడీగా స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే న‌టిస్తోంది. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్ర‌స్ భాగ్య‌శ్రీ కీల‌క పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Bollywood Legendary Actor Mithun Chakraborty Plays Villain In Prabhas 20
సినిమా వార్తలు

#Prabhas20 లో విలన్ గా లెజెండరీ యాక్టర్ ?

గోపీకృష్ణా మూవీస్, యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా పీరియాడిక్ డ్రామా "జాను"(వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రుపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
This Bollywood Actor Becomes A Part Of Prabhas20
సినిమా వార్తలు

#Prabhas 20 మూవీలో మరో బాలీవుడ్ యాక్టర్

గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక వినూత్న ప్రేమకథగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ 'మిర్చి'కి ఏడేళ్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో 'మిర్చి' ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో... శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు కి 'ఆచార్య' - ప్రభాస్ కి 'ఓ డియర్'

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి 'గోవింద ఆచార్య' టైటిల్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. 'ఆచార్య' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారట. మాట్నీ ఎంటెర్టైన్మెంట్ వాళ్లు ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారట.మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొణిదల ప్రొడక్షన్స్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్, హీరోల ప్రొడక్షన్ హౌస్ ?

దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ హీరోగా రూపొందిన "బాహుబలి", " బాహుబలి 2" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డ్ కలెక్షన్స్ తో ఈ మూవీస్ ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. రాజమౌళి ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ "RRR"షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ #Prabhas20 షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!
సినిమా వార్తలు

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి..!

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి అని అంటున్నాడు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... దిల్ రాజు నిర్మాతగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన '96' సినిమా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జాను' టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ టైటిల్ విషయంలోనే దిల్ రాజు ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాడు.

TFN Adminవాట్సాప్
Prabhas Achieves Another Feat
సినిమా వార్తలు

ప్రభాస్ కు దక్కిన మరో ఘనత

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ సినీ కెరీర్ నే మార్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే బాహుబలి సినిమా. ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు కూడా అదే స్థాయిలో పేరును తెచ్చిపెట్టింది. నేషనల్ స్టార్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్