ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా ప్రభాస్ సినీ కెరీర్ నే మార్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే బాహుబలి సినిమా. ఈ సినిమాకు ఎన్ని అవార్డులు వచ్చాయో.. ఈ సినిమాలో నటించిన ప్రభాస్ కు కూడా అదే స్థాయిలో పేరును తెచ్చిపెట్టింది. నేషనల్ స్టార్ నుండి ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికి తాజాగా వచ్చిన సర్వేనే ఉదాహరణ గా చెప్పొచ్చు. లేటెస్ట్ గా బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్టర్న్ ఐ సంస్థలు కలిసి చేసిన సర్వేలో ప్రభాస్ కు అరుదైన ఘనత దక్కింది. ఆసియాలో సెక్సియేస్ట్ ఏసియన్ మ్యాన్ ఆఫ్ 2019 జాబితా లో ప్రభాస్ 10వ స్థానంలో నిలిచారు. టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కావడం విశేషం. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ మొదటి స్థానంలో ఉండగా సౌత్ ఇండియాలో ప్రభాస్ 10 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మొత్తానికి ప్రభాస్ రేంజ్ మాత్రం మారిపోయిందని చెప్పొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























