`వర్షం`, `డార్లింగ్`.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లోని ప్రేమికుడ్ని ఆవిష్కరించిన చిత్రాలివి. ఆ తరువాత మళ్ళీ పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రాలు చేయని మన `బాహుబలి` స్టార్.. ఎట్టకేలకు ఇప్పుడు ఓ లవ్ స్టోరీ చేస్తున్నాడు. `జిల్` రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి జోడీగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ యాక్ట్రస్ భాగ్యశ్రీ కీలక పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఉగాది సందర్భంగా మార్చి 25న `ప్రభాస్ 20` ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారట. అంతేకాదు.. ఓ స్పెషల్ థీమ్ తో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంటుందని టాక్. కాగా, 2021 వేసవిలో `ప్రభాస్ 20` ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























