ప్రభాస్ ‘మిర్చి’కి ఏడేళ్లు

Prabhas Mirchi Completes 7 Years,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Prabhas,Prabhas Latest News 2020,Mirchi Completes 7 Years,Mirchi Movie,Mirchi Telugu Movie,Prabhas Mirchi Movie

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పలు విజయవంతమైన యాక్షన్ ఎంటర్టైనర్స్ లో సందడి చేసాడు. వాటిలో ‘మిర్చి’ ఒకటి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన తొలి చిత్రమిది. రచయిత నుండి దర్శకుడిగా మారిన ఈ సినిమాతో… శివ మొదటి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు. ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ నటించిన ఈ సినిమాలో సత్య రాజ్, నదియా, సంపత్ రాజ్ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి తొలి అడుగు వేయడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేష ఆదరణ పొందాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు.. ఇలా పలు విభాగాల్లో ‘మిర్చి’ ‘నంది’ పురస్కారాలను పొందింది.

2013 ఫిబ్రవరి 8న విడుదలైన ‘మిర్చి’ నేటితో 7 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.