#Prabhas 20 – ఆ విషయంలో కూడా ఇండియన్ ఫస్ట్ ఫిలిం ఇదే

Prabhas 20 Becomes The First Film To Set This Unique Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,#Prabhas20,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Project News,Prabhas Latest Movie Details,Prabhas Upcoming Film Updates,Prabhas 20 Movie Updates,Prabhas 20 Movie Latest News

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే ‘జాన్’ అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడంతో ఈ సినిమాకు ‘ఓ డియర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్పుడే ఈ సినిమా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే.. వర్చ్యువల్ ప్రొడక్షన్ లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మనోజ్ పరమహంస సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ను వర్చ్యువల్ ప్రొడక్షన్ లో చేస్తున్నామని.. ఇండియన్ ఫస్ట్ ఫిలిం ఇదే అని తెలిపాడు.


[custom_ad]

కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా..జగపతి బాబు విలన్ గా నటించనున్నాడు. ఇందులో కృష్ణంరాజు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నట్టు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =