కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Prabhas New Movie Details On Cards

ట్యాగ్ · 18 కథనాలు

సినిమా వార్తలు

కల నెరవేరింది -ప్రభాస్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది . ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్ "బాలీవుడ్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Big B Amitabh Bachchan To Play A Pivotal Role In Prabhas 21
సినిమా వార్తలు

ఆఫీషియల్ 'ప్రభాస్ 21' లో బిగ్ బీ

నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా కు సంబంధించి ఈ రోజు బిగ్ అనౌన్స్ మెంట్ ఇస్తామని చెప్పినదగ్గరనుండి ఏం అప్ డేట్ ఇస్తారబ్బా అని రాత్రి నుండి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. 10 ఎప్పుడు అవుతుందా అని రాత్రి నుండి గడియారం వంక అలా చూస్తూనే ఉండిపోయి ఉంటారు ప్రభాస్ అభిమానులు. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు తెరపడింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ - రేపు బిగ్ అనౌన్స్ మెంట్

అలా నిన్న ప్రభాస్ పుట్టిన రోజుకంటే ముందే బిగ్ సర్ ప్రయిజ్ ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడో లేదో ఇలా వెంటనే అప్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాములు షాక్ ఇవ్వలేదు. పుట్టిన రోజు ముందు అంటే ఇంకా చాలా టైమే ఉంది అని లైట్ తీసుకున్నారు కానీ రేపు బిగ్ అన్నౌన్స్ మెంట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 10 గంటలకు బిగ్ సర్ప రైజ్ ఉందని తెలుపుతూ ట్వీట్ చేసారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బర్త్ డే ముందే బిగ్ సర్ ప్రయిజ్

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్ డేట్ కోసం మరో పక్క అభిమానులు ఎదురు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఈ సినిమా కాస్టింగ్ పూర్తయిందా ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అని నాగ్ అశ్విన్ ను కోరగా దానికి నాగ్ అశ్విన్ కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఓ అభిమాని ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదన్నా అప్ డేట్ ఉందా అన్నా... రిప్లై…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఛలో ఇటలీ - రాధే శ్యామ్ నెక్స్ట్ షెడ్యూల్

కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాల షూటింగ్లు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. నిన్న మొన్నటివరకూ ఇక్కడే షూటింగ్ స్టార్ట్ చేయగా ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధేశ్యామ్ టీం కూడా ఇటలీకి పయనమైనట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ ముందు అక్కడ కొంత చిత్రీకరణ జరుపుకుంది రాధేశ్యామ్ సినిమా. కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక మొన్నటి వరకూ విదేశాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో అక్కడ చాలా వరకూ షూటింగ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు విదేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే రాధేశ్యామ్ షూటింగ్ కోసం వెళ్లిపోయారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్

బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కు అధిక సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. స్టైలిష్ మూవీ "సాహో "బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో ఉత్తరాది లో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ "ఆదిపురుష్ " అనౌన్స్ అయ్యింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆ సినిమా అప్పుడు నేను చాలా రోజులు నిద్రపోలేదు..!

ఏదో వారసత్వం.. లక్కో.. కాలం కలిసొస్తేనో హీరోలు అయిపోరు. అలా అయినా ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండరు. కష్టపడాలి.. టాలెంట్ ఉండాలి.. సినిమా సినిమాకు వైవిధ్యత చూపించాలి. ప్యాషన్ ఉండాలి. అలా అయితేనే స్టార్ హీరోలు అవుతారు. అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ హీరో అయినా ఒక సినిమాకు 5 ఏళ్ళు కేటాయించగలడా? అంత ధైర్యం ప్రభాస్ చేసాడంటేనే చెప్పొచ్చు ప్రభాస్ డెడికేషన్ ఏంటో. కేవలం ఒక్క జోనర్ కు మాత్రమే ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్లు ట్రై చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేంజ్ కు ఎదిగాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?

తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. అంతే కాదు ఒక పార్క్ ను కూడా దత్తత తీసుకుంటానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇందులో భాగంగానే ఈ రోజు కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కును దత్తత తీసుకున్నాడు. అంతేకాదు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్ చొరవ‌తో పార్కును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తెలిపారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో ప్రభాస్ అడ్వాన్స్ బర్త్ డే సీడీపీ రిలీజ్

"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ "వర్షం " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సెన్సేషనల్ హీరోగా సినీ మా అవార్డ్ అందుకున్నారు. "ఛత్రపతి ", "బిల్లా ", "Mr పర్ ఫెక్ట్", "మిర్చి " వంటి మూవీస్ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తం గా గుర్తింపు పొందారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఏర్పడింది. బాలీవుడ్ లో హీరో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ప్రభాస్ హీరోగా నటించిన స్టైలిష్ మూవీ "సాహో " బాలీవుడ్ లో ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

కరోనా నిబంధనలతో ప్రీ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసిన 'ఆదిపురుష్' టీమ్

'ఆదిపురుష్' టీమ్ రాపిడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన దగ్గరనుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ను కుష్ చేస్తున్నారు. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత, సాహో సినిమాలకు అప్ డేట్స్ ఎంత లేట్ గా వచ్చాయో తెలుసు. రాధే శ్యామ్ సినిమాకు అయితే ఫ్యాన్స్ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చేస్తేకాని ఆ టైటిల్ పోస్టర్ పోస్టర్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు 'ఆదిపురుష్' టీం మాత్రం వరుస అప్ డేట్స్ ఇస్తుంది.

TFN Adminవాట్సాప్
Prabhas To Practice Archery At Home For Adipurush?
సినిమా వార్తలు

ఇంట్లోనే విలు విద్య ప్రాక్టీస్ ..?

బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్‌’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఓం రౌత్ కొత్త మేకోవర్ తో కొత్త ప్రభాస్ ను చూపించబోతున్నట్టు మాత్రం అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నామని... అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నాడని డైరెక్టర్ చెప్పడం జరిగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆదిపురుష్' లో ప్రభాస్ పాత్ర చెప్పేసిన నాగ్ అశ్విన్

బాహుబలి సిరీస్ కు ముందు ప్రభాస్ రేంజ్ వేరు.. బాహుబలి సిరీస్ తర్వాత వేరు.. ఈ సిరీస్ తో ప్రభాస్ స్థాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. ఒక గ్యాంగ్ స్టర్ అయినా లవర్ బాయ్ అయినా ఒక యోధుడిగా అయినా ఇలా ఒక్కటేంటి అన్ని రోల్స్ కు కూడా ప్రభాస్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఏదో నాలుగు ఫైట్ లు నాలుగు పాటలు ఉన్న సినిమాలు చేయడానికి లేదు ప్రభాస్. ప్రభాస్ నుండి కూడా అలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాలనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో భారీ అండ్ పాన్ ఇండియాగా 'రాధేశ్యామ్' సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

'ప్రభాస్ 22' టైటిల్ పోస్టర్ రిలీజ్

గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "వర్షం "మూవీ 2004 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ మూవీ లో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా "నువ్వొస్తానంటే "సాంగ్ ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.

Team TFNవాట్సాప్
Prabhas & Prahanth Neel To Unite For A Project
సినిమా వార్తలు

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?

ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న 'బాహుబలి'

జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటగా తాజాగా ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ తనవంతుగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు నామినేట్ చేస్తున్నాను అని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రభాస్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్‌

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో తమ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా.. బయటకు రాకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూనే ఉన్నారు. అప్పుడప్పుడు పలు వీడియోల ద్వారా కనిపిస్తూనే వున్నారు. అయితే ప్రభాస్ మాత్రం ఇంతవరకూ కనిపించింది లేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్.. ఇప్పుడు ఫైనల్ గా కెమెరా ముందుకు వచ్చారు. ప్రభాస్ తాజాగా గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. తాజాగా టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాడు…

TFN Adminవాట్సాప్

షేర్