బర్త్ డే ముందే బిగ్ సర్ ప్రయిజ్

Director Nag Ashwin Promises A Surprise Gift To Prabhas Fans On The Occasion Of Prabhas Birthday

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ సినిమా కాబట్టి ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా అప్ డేట్ కోసం మరో పక్క అభిమానులు ఎదురు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గతంలో ఈ సినిమా కాస్టింగ్ పూర్తయిందా ఏదో ఒకటి రిప్లై ఇవ్వండి అని నాగ్ అశ్విన్ ను కోరగా దానికి నాగ్ అశ్విన్ కూడా స్పందించి రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ఓ అభిమాని ప్రభాస్ పుట్టిన రోజుకు ఏదన్నా అప్ డేట్ ఉందా అన్నా… రిప్లై ఇవ్వు అన్నా అని ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆ ట్వీట్ కు నాగ్ అశ్విన్ రిప్లై చేశాడు. బర్త్ డే ఓన్లీ సింపుల్.. ఈ కరోనా వల్ల మన షూట్ కే ఇంకా చాలా టైం వుంది.. ఇప్పుడే ఎక్కువ చెప్పలేను.. కానీ బర్త్ డే కి ముందే కిల్లర్ అప్ డేట్ ఇస్తామని చెప్పారు.

 

కాగా ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ భారీ అండ్ పాన్ ఇండియాగా ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ సినిమా చేస్తున్నాడు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =